ఉ.నాలుక రామచంధ్రఘన నామజపంబున ప్రొద్దుపుచ్చుటే మేలగు గాని కుక్షికిడ మెక్కుచు నుండిన లాభమున్నదే చాలును షడ్రసంబు లనిశంబును గోరుట కోరవయ్య ము క్కాలము బ్రోచు మోక్షఫల కారక తారక నామ మంత్రమున్ |
28, అక్టోబర్ 2015, బుధవారం
నోటికి హితవు రామనామమే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
క.నడిచెడిది దివ్యపధమట,నడిపించు విభుండు రామభద్రుండట,నే
రిప్లయితొలగించండినడిచిన భవహర మగునట,నడిచెద వేఱొండుదారి నడువగ నేలా.
గుర్తుందా!ఇప్పుడు కొంచెం శ్రధ్ధగా మార్చాను,నదతకి సంబంధించిన అర్ధం వచ్చేటట్టు.చందస్సు,యతి నియమం అవీ సరిపోతున్నాయా?సరిపోతుందనే అనుకుంటున్నాను!
హరిబాబుగారూ, కందపద్యనియమాలు మీకు తెలుసును కాబట్టి వాటిని గూర్చి ముచ్చటించను. ఛందస్సు విషయుం సరిపోవటంలో ఇబ్బంది రాలేదు. మీరు పోతన్నగారి
తొలగించండికం. పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామ భద్రుండట
నే పలికిన భవహర మగునట
పలికెద వేరొండు గాథ పలుకగ నేలా!
అన్న పద్యంలో కేవలం మీరు పలికెడిది అన్నదానిని నడచెడిది అని స్వల్పంగానే మార్పు చేసుకోవటం వలన.
ఐతే యతివిషయకంగా చిక్కు వచ్చిపడింది. పలికెడిది అన్నమాట పాదాదిలో వస్తున్నది మీరు నడచెడిది అని మార్చినప్పుడు యతిమైత్రి 'న' అన్న అక్షరానికి వచ్చేలా 2, 4 పాదాల్లో మార్పు చేయటం అనివార్యం అని మరచిపోవటం దానికి కారణం. పోతన గారు ప-భలకు ప-ప లకు యతిమైత్రి చెల్లించారు. మీరు యతివిషయంలో పొరబడటం వలన న-భ లకు 2వ పాదంలో యతి కుదరలేదు. అది కూడా సరిచేసుకోవాలి. మీరు రెండవపాదంలో నడపించు విభుండు రామనాథుండట అని అంటే సరిపోతుంది. మీరు మరోలాగు సరిచేసుకుంటానంటే అభ్యంతరం లేదు.
పోతన గారి పద్యం రెండో పంక్తిలో "పలికించెడివాడు రామభద్రుండట" అని ఉన్నట్లు గుర్తు. మరి మీరేమో "పలికించు విభుండు ...... " అంటున్నారు :(
తొలగించండివిన్నకోటవారూ,
తొలగించండినా దగ్గర ఉన్న భాగవతప్రతిలో ఉన్న పాఠం చూపించానండి. మీరు చెప్పిన పద్యపాఠం కూడా ప్రచారంలో ఉన్నదే. ఏది సరైన పాఠమో తెలియదు.
కం.
తొలగించండినడిచెడిది దివ్యపధమట
నడిపించు విభుండు రావణారియె కాగా
నడిచిన భవహర మగునట
నడిచెద వేఱొండుదారి నడువగ నేలా
హరిబాబు గారు, మీరు ఇలా రాస్తే ఛందస్సు కుదురుతుందనుకుంటా.
శ్రీకాంత్ చారిగారూ, మీరు సూచించిన పద్యపాఠంలో కూడా ఒక ఇబ్బంది ఉంది. యతికి సంబంధించినదే. అదీ మరలా రెండవపాదంలోనే. పాదాదిని ఉన్న 'న'తో రావణారిలోని 'ణా'తో యతి మైత్రిని నెఱపితే అది అఖండయతి అవుతుంది. ఎందుకంటే రావణ+అరి->రావణారి కదా. అందుచేత 'న'కు 'అ'తో యతిని చెల్లించినట్లు అవుతుంది. అది అంత సంభావ్యం కాదు. అఖండయతిని అనేకులు ఒప్పుకోరు. ఒప్పుకున్న కవులూ ఉన్నారనుకోండి. ఐనా దాని వివాదం తేలేది కాదు.
తొలగించండి""నడపించు విభుండు" అంటే సరిపోతుందంటున్నారు కాబట్టి అదే చేస్తాను.అందుకే మీ పరిశీఎలన కోసం అడిగాను.కృతజ్ఞతలు!
రిప్లయితొలగించండిపోతన గారు తన కవిత్వం గురించి చెప్పుకొన్నది ఆయన కొక్కడికే వర్తిస్తుంది.నదత అందరికీఎ అవసరమే కాబట్టి ఇది మనకి మనం చెప్పుకున్నట్టు ప్రతి ఒక్క్కరికీ వర్తిస్తుంది అని నా ఉద్దేశం.
P.S:ఈ వెర్షన్ నేను మీకిచ్చిన లింకు నుంచి నేను డౌన్ లోడ్ చేసుకున్నదే.
హరిబాబుగారూ, మన పోతనామాత్యులవారు
తొలగించండికం. పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామ భద్రుండట
నే పలికిన భవహర మగునట
పలికెద వేరొండు గాథ పలుకగ నేలా!
అన్న పద్యం, తన కవిత్వం గురించి చెప్పుకొన్నదీ, ఆయన కొక్కడికే వర్తిస్తుందీ అన్నది సామాన్యమైన ఊహ. నిజానికి అంతకంటే విస్తృతమైన అన్వయం ఉన్నదండి.
భాగవతం అంటే భగవత్సంబంధియైనది - భగవంతుని యొక్క గుణనామరూపమాహాత్మ్యాదులను గురించి అనుగ్రహ అవతారవిశేషాలను గురించి కావచ్చును అలాగే పరమ భాగవతులైన మహాత్ముల గురించిన విశేషాలు కావచ్చును. అవీ భాగవతమే, ఇవీ భాగవతమే. పక్వమైన మానసిక సాధనా స్థితికి చేరుకున్న వాడు పలికేది భాగవతం మాత్రమే - అన్య మైన ప్రాపంచిక విషయాలను అటువంటి వారు ప్రస్తావించరు కూడా. ఐనా ఆ భాగవతవిశేషం వారి నోట నిత్యం పలికించేది భగవదనుగ్రహమే. అదిలేనిది మనిషికి శుభేఛ్ఛ లేదు సుమా.పలికించేది భగవంతుడి కృప - నేను అన్న స్థితిలో ఉన్న జీవుడను నేను దానిని పలికేవాడను - ఆ క్రియాకలాపం యొక్క ఫలితం భవహరణమే - అంటే మోక్షమే. అని తలచాలి. అందుచేత ప్రతివాడున్నూ ఇది భావన చేసి లౌకికమైన వేరొండు గాథలు (ఇతర సంగతులు) - భగవంతుడు అనుగ్రహించిన ఈ నోటితో పలుకటం ఎందుకు అని ప్రశ్నవేసుకొని స్థిరుడై భగవద్విభూతిని మననం చేసుకొంటూ భాగవతము నందే నిత్యం అనురక్తుడై ఉండాలని ఈ పద్యం యొక్క అంతరార్థం అని నా అభిప్రాయం.
నిజమే,నా అర్ధం కూడా ఆ పద్యం పోతన గారూ,పౌరాణికులూ యెవరైనా పలకతం గురించి కదా,నా మార్పు నద్తకి సంబ్నధించినది అని న అభవం!
తొలగించండిపలకదం అంతే ఇత్ర్లకి చెప్పడం అని కదా!చెప్పేవారు చెప్తున్నందుకు వారు ధన్యులునడిచేవారు విని నడుస్తున్నందుకు ధన్యులు అవుతారు.నా భవం కేవలం నాకున్న్న సరదా వల్లనే కానీ పోతన గారికి భిన్నంగా వెళ్ళటానికి నేనెనతటివాణ్ణీ?
హరిబాబుగారూ,
తొలగించండిముద్రారాక్షసాలు చాలా హెచ్చుమోతాదులో వస్తున్నాయి. దయచేసి, కొంచెం గమనికగా ఉండండి.
is this version ok?
రిప్లయితొలగించండిక.నడిచెడిది దివ్యపధమట,నడపించు విభుడు రామనాధుండట,నే
నడిచిన భవహర మగునట,నడిచెద వేఱొండుదారి నడువగ నేలా
any more changes!
శ్రీకాంత్ చారి గారూ,
రిప్లయితొలగించండిమీకూ చందస్సుతో పరిచయం ఉందా?నేనెప్పుడూ చూడలేదే!
గణాలు సరిపోలేదనుకుంటా
రిప్లయితొలగించండిఇలా ఐతే సరిపోతాయి.
కం.
నడిచెడిది దివ్యపధమట
నడిపించు విభుండు రామనాధుండవగన్
నడిచిన భవహర మగునట
నడిచెద వేఱొండుదారి నడువగ నేలా?
కొద్దిగా తెలుసు హరిబాబు గారు. చిన్నప్పుడు పదోతరగతి తెలుగులో నేర్చుకున్నా.
శ్రీకాంత్ చారిగారూ, హరిబాబుగారి పాఠంలో 'నడపించు విభుడు' అన్నది టైపో - 'నడపించు విభుండు' అనబోయి నప్పుడు పూర్ణానుస్వారం పడలేదు. అది సరిచేస్తే సరి, గణాలు సరిగానే ఉన్నాయి. టైపో సరిచేయటం తప్ప, మార్పు అవసరం లేదు. మీరిప్పుడు ఇచ్చిన పాఠం కన్నా నాకు హరిబాబుగారి పాఠమే బాగుందనిపించింది.
తొలగించండిShyamaleeyam garu,
తొలగించండిGot it, thanks
అవును,అది తైపోనే,కాబట్టి:
రిప్లయితొలగించండికం.
నడిచెడిది దివ్యపధమట
నడపించు విభుండు రామనాధుండట,నే
నడిచిన భవహర మగునట
నడిచెద వేఱొండుదారి నడువగ నేలా?
ఈ వెర్షన్ బాగనే ఉందనుకోవచ్చా!
వచ్చు.
తొలగించండిthanks!
తొలగించండి