నమ్మకముగ మోక్ష మున్న దండీ
నమ్మి సాటినరుల నమ్మి వ్యర్ధసిరుల
నిమ్మహి పొందే దేమున్న దండీ
శ్రీరామనామమె సిరులన్నిటి నొసగు
చింతామణి యని తెలుసుకోండి
ఆరామనామంబు నాశ్రయించిన వారు
వేరేమీ జన్మలో కోరరండీ
శ్రీరామునే నమ్మి కూరిమితో చేసి
శ్రీరామధామంబు చేరేరండి
శ్రీరామపాదాల సన్నిధికే బుధులు
వేరొక్క దారేదీ వినబడదండీ
రామభక్తుల జేరి రామనామము పొంది
రాముని సన్నిధి చేరుకోండి
భూమిపై నల్పుల పొగడుచుండక మీరు రామసంకీర్తనారతులు కండీ
కామారియే పొగడు రామనామము కన్న
కామించదగిన దేమున్న దండీ
శ్రీమన్నారాయణు శ్రీరామచంద్రుని
మీమనసులో నిల్ప మేలౌనండీ