ప్రమితాక్షరము. కరుణాలవాల నిను కన్నులతో నరయంగ రామ యెటు లబ్బునయా యరుదైనభాగ్యమది యట్లగుటం బరమాత్మ వచ్చెదవు స్వప్నములన్ |
ప్రమితాక్షరము.
ఈ ప్రమితాక్షరవృత్తానికి గణవిభజన స-జ-స-స. అంటే పాదానికి పన్నెం డక్షరాలు. గురులఘుక్రమం IIUIUIIIUIIU. యతిస్థానం తొమ్మిదవ అక్షరం.
ఈ ప్రమితాక్షరంలో ఉన్న గణాలన్నీ చతుర్మాత్రాగణాలన్నది గమనార్హం. కాబట్టి నడక చతురస్ర గతిలో IIU IUI IIU IIU అనే విరుపులతో ఉంటుందని పించవచ్చును. కాని దీని నడక IIUI UIII UIIU అని నాలుగేసి అక్షరాలకు ఒక విరుపుతో కనిపిస్తున్నది ఇక్కడ నేను చూపిన పద్యంలో.
కరుణాల | వాల నిను | కన్నులతో |
నరయంగ | రామ యెటు | లబ్బునయా |
యరుదైన | భాగ్య మది | యట్లగుటం |
బరమాత్మ | వచ్చెదవు | స్వప్నములన్ |
విశ్వనాథవారు ప్రమితాక్షరాన్ని రామాయణకల్పవృక్షంలో వాడలేదు. ఇతరకవు లెవరన్నాఈ ప్రమితాక్షరాన్ని వాడిన వివరం తెలియదు..