1, డిసెంబర్ 2015, మంగళవారం

అర్థకళా వృత్తంలో రామస్తుతి.





        అర్థకళ.
        నిరవద్యగుణాభరణా
        సురసేవిత శ్రీచరణా
        ధరణీతనయారమణా
        విరతాఖిలదైత్యగణా





ఈ చిన్నారి వృత్తానికి పాదానికి గణాలు స - స - స. అంటే పాదానికి మూడు స-గణాలు. యతిస్థానం లేదు. పైర పద్యంలో అంత్యప్రాసకూడా వాడాను.

ఈ పద్యంలో ఉన్న పదజాలమంతా సంస్కృతమే అనుకోండి. కాని అన్నీ అందరికీ పరిచయం ఉండే పదాలే కాబట్టి సుబోధకంగానే ఉంటుందని ఆశిస్తున్నాను.

జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇందులో రామాయణసారం సూక్షరూపంలో సాక్షాత్కరిస్తుంది.