1, నవంబర్ 2017, బుధవారం
వేదాంతమును గూర్చి వినిపింతును
వేదాంతమును గూర్చి వినిపింతును మీకు
వేదవేద్యుని గూర్చి వివరింతును
భేదత్రయము లేక వెలుగొందు బ్రహ్మమే
యాదిపూరుషుడు శ్రీహరి నాబడు చుండు
ఆ దివ్యతత్త్వపరివ్యాప్తిలో విశ్వంబు
కాదొక్క సూక్ష్మాంశ కన్న నధికము
హరిని జొచ్చియున్నదీ యఖిలవిశ్వంబును
హరిచొచ్చి యున్నవా డఖిలచరాచరముల
పరమమమైన మాయచేత భావించరామి గాక
హరియంశలేని దొక్క యణువైన లేదు
ఆ వేదవేద్యుడు హరి యవతరించి రాముడై
భావింప పరమధర్మ పధము విస్తరించెను
కావున నరులార గడచుడీ మాయను
దేవుడా రామునిటు తెలిసి యుపాసించుచు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)