ఎవ్వడ తానని తలచేనో యెవ్వడ వీవని యెంచేనో రివ్వురివ్వున నివ్వలకవ్వల కివ్విధి తిరుగుట మానకను |
|
గిలగిలలాడుచు తాపత్రయముల కువలయ మంతయు తిరుగుచును మిలమిలలాడే బొమ్మల వెనుకనె వలపులు జూపుచు తిరుగుచును తలపున నుంచగ దగు దైవంబును తనలో తలచక తిరుగుచును కలుగుచు తొలగుచు నిత్యము నాసున కండెవోలె తా తిరుగుచును |
ఎవ్వడ |
తనభోగమునకె ధరలో సకలము తనరారెడునని తలచుచును ధనములు గెలచుట మాత్రమె జీవన తాత్పర్యంబని తలచుచును తనసంతోషమునకు మించినదొక ధర్మము లేదని తలచుచును తనబ్రతుకునకును మించిన సత్యము ధరలో లేదని తలచుచును |
ఎవ్వడ |
మోహభూమికాసప్తక మందున మునిగి తేలుచు నిరతమును దేహి విడువడు పంచమలముల తెలియ నేరడు పరమమును ఆహా వాడు సుఖేఛ్ఛకు వచ్చుట యన్నది లేదను విషయమును ఊహించి దయాళో శ్రీరామా యుధ్ధరించ మని యడిగెదను |
ఎవ్వడ |
2, సెప్టెంబర్ 2016, శుక్రవారం
ఎవ్వడ తానని తలచేనో
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)