ఏదో ఒకరోజు రాదా, ఏదో ఒక మార్పు రాదా! ఏదారీ లేదనే గోదారే దిక్కనే ఈ దైన్యం తీరిపోదా! కనువారలు వినువారలు కనబడరని కలగకు, కనులపొరల మనుషులకు వినయశీలు రలుసులే ! కనబడని దేవతలకు వినబడులే నీఘోష! మనజనగణ వేదనలు మలగుదినం కలదులే. ॥ఏదో ఒకరోజు॥ అసలే ఒక శప్తజాతి ఆంధ్రులన్న పేరుందని, కసిరికసిరి నసిగినసిగి కొసరే రరకొరగ దొరలు! రుసరుసలా? నువ్విప్పుడు రొక్కిస్తే ఇదేమని! దసరాపులులే సుమా పసలేని నేతలు! ॥ ఏదో ఒకరోజు॥ కలకాలం ఉంటాయా కష్టాలూ కన్నీళ్ళూ? తెలుగువాడి ప్రభ రేపు దేశంలో వెలుగదా? తలపొగరు నేతలకు తగినశాస్త్రి జరుగదా? నిలువదా నీ పక్షం నిలింపుల ఔదార్యం! ॥ఏదో ఒకరోజు॥ |
||
4, మార్చి 2015, బుధవారం
ఏదో ఒకరోజు రాదా, ఏదో ఒక మార్పు రాదా!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)