తెలుగుతల్లీ నీకు వందనం ఘనకీర్తి కలిగి వెలిగే తల్లి కరుణించవే తల్లి తెలుగుతల్లీ నీకు వందనం కన్న బిడ్డలు నేడు కాట్లాడుకొంటుంటె కన్నీళ్ళు పెడుతున్న కళవళ పడుతున్న తెలుగుతల్లీ నీకు వందనం కలుముల గడ్డను కొలిమిగా మార్చిన కలుషబుధ్ధుల జూచి కళవళ పడుతున్న తెలుగుతల్లీ నీకు వందనం నిరసించి కొందరు నీకన్న బిడ్డలే కొరగాని మాటలుకూడ పలికేరమ్మ తెలుగుతల్లీ నీకు వందనం పరభాషలను మెచ్చి పరరాజులను మెచ్చి కరకులాడే వారి గాంచి శోకించేవు తెలుగుతల్లీ నీకు వందనం నీది తప్పన్నచో నీది తప్పని శుష్క వాదాల నీ పేరు పాడుచేసితి మమ్మ తెలుగుతల్లీ నీకు వందనం మా లోపములుచూచి లోలోన కుమిలేవు కాలప్రభావమ్ము కలిగించె దుర్దశ తెలుగుతల్లీ నీకు వందనం కూడిరాని బిడ్డ లీడ పోగైరమ్మ ఓడలు బండ్లాయె నేడు మాతల్లి తెలుగుతల్లీ నీకు వందనం ఈ తీరుగా నిన్ను ఇరుకున పెట్టేము మా తప్పులను నీవు మన్నించ వమ్మ తెలుగు తల్లీ నీకువందనం కొంచెమై యుండగా కొన్నాళ్ళు గడచి మంచిరోజులు మనకు మరల రావచ్చు తెలుగుతల్లీ నీకు వందనం అన్నదమ్ముల మధ్య అగ్గిరాజేసిన చిన్నబుధ్ధుల ప్రభ చెరిగిపోవచ్చు తెలుగుతల్లీ నీకు వందనం ఇటువంక నీ బిడ్డ లెటువంటి వారొ అటువంక నీ బిడ్డ లటువంటి వారె తెలుగుతల్లీ నీకు వందనం పాలపొంగు నేడు పగులగొట్టే నేల కాలాంతరంబున కలిసిపోయేనమ్మ తెలుగుతల్లీ నీకు వందనం |
3, ఫిబ్రవరి 2014, సోమవారం
తెలుగుతల్లీ నీకు వందనం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)