22, జులై 2025, మంగళవారం

శ్రీరాముడు

శివుని యంత వాడగు యీ శ్రీరాముడు సదా
శివుని విక్రమమున నొప్పు శ్రీరాముడు
 
శివుని విల్లు విరిచినాడు శ్రీరాముడు రేగి
శివభక్తుని విరిచినాడు శ్రీరాముడు
శివప్రతిష్ఠ చేసినాడు శ్రీరాముడు మహా
శివుని పూజించినాడు శ్రీరాముడు 

శివుని పరమభక్తు డైన శ్రీరాముడు తాను 
శివుని గాంచి మ్రొక్కినాడు శ్రీరాముడు 
శివుడు పొగడ మురిసినాడు శ్రీరాముడు సదా
శివుడే తానైన హరి శ్రీరాముడు

శివుని యెడదలో నుండును శ్రీరాముడు సదా
శివుని యెడదలో నుంచును శ్రీరాముడు
శివుని యవతారమైన శ్రీరాముడు కే
శవుని యవతారమైన భవతారకుడు

1 కామెంట్‌:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.