దండాలు దండాలు దండాలు
దండాలు శతకోటి దండాలు
దశరథాత్మజున కివె దండాలు హరికి
దశకంఠవైరి కివె దండాలు
కుశలంబు సద్భక్తకోటి కెప్పుడును
గూర్చుదేవున కివె దండాలు
వశవర్తులగుచు దేవతలు కీర్తించు
బ్రహ్మాండపతి కివే దండాలు
దశదిశల సత్కీర్తి తాండవంబాడు
ధర్మస్వరూపునకు దండాలు
భూమిజానాథునకు దండాలు సార్వ
భౌమునకు శతకోటి దండాలు
కోమలాంగున కివే దండాలు హరికి
శ్యామలాంగున కివే డండాలు
క్షేమంకరున కివే దండాలు సమర
భీమునకు శతకోటి దండాలు
కామారి వినుతునకు దండాలు హరికి
రామయ్య తండ్రికివె దండాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.