13, ఫిబ్రవరి 2025, గురువారం

నిన్ను నమ్ముకొన్న


నిన్ను నమ్ముకొన్న నన్ను మన్నించవయా

చిన్నచిన్న తప్పులకే శిక్షించకయా


వన్నెచిన్నెల పసిడిపైన భ్రాంతి సహజమై

యున్నదిరా సీతారామ యుర్వి నరులకు

నన్నిందుకు తప్పుబట్ట న్యాయముకాదో

రన్నా కాంచనచేలా రామచంద్రుడా


అన్నులమిన్నలను చేరు నాశ సహజమే

యెన్నడైన మగపుట్టువు గొన్న జీవికి

నన్నిందుకు తప్పుబట్ట న్యాయముకాదో

రన్నా బహుసహస్రగోపికాంగనా విభో 


నిన్ను చేరు నడ్డదారు లన్న పిచ్చితో

యెన్నెన్నో చెడుదారుల నెన్నిచెడితిని

నన్నిందుకు తప్పుబట్ట న్యాయముకాదో

రన్నా వైకుంఠవాస రామచంద్రుడా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.