రామ జయం శ్రీరామజయం రఘు
రాముని నమ్మిన లేదు భయం
రాముని నమ్మిన లేదు భయం మన
రాముని నమ్మిన కలుగు జయం
రాముని నమ్మిన చాలును పాపా
రణ్యములన్నియు కాలునురా
రాముని నమ్మిన చాలును దుర్భర
కామాదులు నశియించునురా
రాముని నమ్మిన చాలును మనసున
రయమున శాంతము కలుగునురా
రాముని నమ్మిన చాలును రాముడు
ప్రేమామృతమును కురియునురా
రాముని నమ్మిన వారికి సిరు లతి
రయమున తామై చేరునురా
రాముని నమ్మిన వారికి సుజనులు
ప్రేమగ మ్రొక్కుచు నుందురురా
రాముని నమ్మిన వారిని యముడు ప
రాకున నైనను చెనకడురా
రాముని నమ్మిన భవబంధంబులు
రయమున భళ్ళున రాలునురా
పరాకునైనను రాముని మరువని
భక్తులు మిక్కిలి ధన్యులురా
ధరాతలంబున రాముని భక్తులు
తప్పక మిక్కిలి ధన్యులురా
హరేరామ శ్రీరామరామ యను
నందరు మిక్కిలి ధన్యులురా
బరాబరిగ శ్రీరాముని భక్తులు
బడయుట మోక్షము తథ్యమురా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.