4, ఫిబ్రవరి 2025, మంగళవారం

ఏనామం ఏనామం


ఏనామం ఏనామం
మానవులారా శుభనామం

భయంబుల బాపు నే నామం
జయంబుల నిచ్చు నే నామం
నయంబుగ గాచు నేనామం
దయామయ రామ నీనామం

శివుండును మెచ్చు శుభనామం
కవీంద్రులు పాడు ఘననామం
జవంబును గూర్చు హరినామం
భవాంతక రామ నీనామం

ధనంబుల నిచ్చు నేనామం
మునీంద్రులు గొల్తు రేనామం
జనేశ్వర స్తుత్య మేనామం
    అనామయ రామ నీనామం

ధరాత్మజ ప్రాణ మేనామం
పరంబును గూర్చు నేనామం
నిరంజన మైన దేనామం
పరాత్పర రామ నీనామం

యుగంబులు నిల్చు నేనామం
జగంబుల నేలు నేనామం
నిగమాంతవేద్య మేనామం
జగత్పతి రామ నీనామం


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.