9, ఫిబ్రవరి 2025, ఆదివారం

శ్రీరామరామ యని

 

శ్రీరామరామ యని చేయవే నామము

ఆనామ మిచ్చునే యానందము


ఏనామము నూతగొని వానురులా రాకాసుల

మానక రణరంగమందు మర్దించిరో

ఆనామము నూతగొని యాదుష్టకామాదుల

పూని మర్దించవచ్చు నీనాడు నీవు


ఏనామము నూరగిని యిలను చిరంజీవియై

తానువెలసె హనుమన్న యానామముని

మానక నీవూతగొని మరిమోక్షరాజ్యమే

పూని సాధించవచ్చు నీనాడు నీవు


ఏనామము నూతగొని యెందరో తరించిరో

ఆనాము నెన్నడును మానక నీవు

ధ్యానించి చిత్తమా తరియించ నేర్వవే

పూనికతో భవసాగరమును నీవు చక్కగా



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.