7, ఆగస్టు 2018, మంగళవారం

మనఃపుష్పార్చన


ఉన్న దొకే చిన్న పూవు మన్ని కైన పూవు
నిన్ను చేరు తహతహతో నున్నదీ పూవు

సేవించగ వచ్చినదీ చిన్న పూవు దాని
తావి నీవు మెచ్చిన కడు ధన్యమగు పూవు
ఈ వెఱ్ఱి మనసనే యెంతో చిన్నపూవు
నీవు గైకొన్న గాని నిలువలేని పూవు

నీ పై యనురక్తితోడ నిండిన దీ పూవు
ఓప లేని తహతహతో నున్నదీ పూవు
చేపట్టి యేలుదువని చేరిన దీ పూవు
నీ పాదసన్నిధిని నిలచిన దీ పూవు

తనరు భక్తిపరీమళము దాల్చిన పూవు
జనకజారమణు కరుణ జాలను పూవు
తనకు వేరు గతి వలదని తలచు పూవు
మనసనే పూవు మంచి వినయము గల పూవు

2 కామెంట్‌లు:

  1. ఇప్పుడే చదివాను 'మనఃపుష్పార్చన' ను.
    బాహ్యోపచారాల కన్నా భక్తిప్రపత్తులే భక్తుడిని భగవంతుడి దరి చేరుస్తాయి. పరమరమ్యంమైన భావార్చన. సర్వోన్నత మానసిక పూజ ఇది.
    ఒక్కమాటలో చెప్పాలంటే -
    'అత్యున్నత ఆరాధనం'.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు భారతి గారూ,
      ఈమధ్యనే 400 కీర్తనలు పూర్తయ్యాయి శ్రీరామసంకీర్తనంలో. అన్నింటినీ ఒక శ్రీరామసంకీర్తనం అన్న పేజీలో ఉంచాను అసక్తి కలవారిని అన్నీ ఒకచోట సులభంగా కనిపించేందుకు వీలుగా.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.