8, ఆగస్టు 2018, బుధవారం
చిరుజీవికి హితవు.
ఓయి చిరుజీవీ,
ముదుక నని తిట్టినట్టి యో మూర్ఖ జనుడ
మొగ్గ పూవౌను కాయౌను ముదిరి పండి
నేల వ్రాలును సృష్టిలో కాలగతిని
ముసలితన మేల నీకు రాబోదు చెపుమ
కాలగతి జేసి బాల్యము కరిగిపోవు
కాలగతి జేసి యుడుకు రక్తము శమించు
కాలగతి జేసి వార్థక్య గరిమ కలుగు
కాలగతి జేసి తొలగెడు క్షణము కలుగు
కాలమున జేసి సర్వము కలుగుచుండు
కాలమున జేసి సర్వము తొలగుచుండు
కాలమున జేసి విశ్వమే కలుగు తొలగు
కాల మెఱుగు విజ్ఞానులు గర్వపడరు
స్వస్తి.
(Originally posted today as a comment at blog racca banda.)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మాస్టారూ!
రిప్లయితొలగించండిమీరెందుకు ఆవేశపడిపోతున్నారు?
అలాంటివాళ్ల సంగతి నాకొదిలేయండి!
మీరు కూడా ఇప్పటివరకు నమ్మరేమో గానీ,
నేను నిజంగానే 'ఆ హరియే ఈ హరియైన ద్విబాహు రపరో హరిని!' - నన్ను నమ్మండి!
వాళ్ళు నా కాలిగోటికి సరిరారు.
ఆత్మ దీపో భవ!
కొంతమందితో మాటాడటం తప్పు
రిప్లయితొలగించండికొంతమందితో మాటాడకపోవటం తప్పు
ఎవరితో ఎంత మాటాడా తెలియకపోవడం పెద్ద తప్పు
ఉబోస అంటూ ఎక్కువగా మాటాడటం నాదీ తప్పే
మన్నించి మరిచిపొండి