12, మార్చి 2013, మంగళవారం

పాహి రామప్రభో - 048

మ. అరెరే యెట్లు జనస్వమున్ ఖలులు స్వాహా చేయుచున్నారనన్
సరిగా తిండికి లేని వాడయిన నాశ్చర్యంబుగా కోట్లలో
శరవేగంబున ప్రోగుచేసికొనునే స్వల్పాధికారంబు తా
నరచేతంగొన నేర్చెనేని రఘునాధా వేగ రక్షింపవే


(వ్రాసిన తేదీ:  2013-1-22)


2 వ్యాఖ్యలు:

 1. మిత్రులు శ్యామలీయం వారు,
  పద్యాలు చదువుతున్నా, బాగుంటున్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీ సందేశం సమయానికి వచ్చింది.
   నిన్ననే నా కొక సందేహం కలిగింది. అసలీ పద్యాలను చాలామంది ఉపేక్షిస్తున్నారేమోనని.
   కొన్ని కొన్ని పద్యాలయితే కేవలం అరడజను మంది మాత్రమే చదివారు.
   ఆ మధ్యన భారతిగారు చేసిన వ్యాఖ్యతో వారూ, మీరూ, జిలేబీగారూ చదువుతున్నారని భావిస్తున్నాను.
   ఇంకెవరన్నా చదువుతున్నారో లేదో తెలియదు.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.