శ్రీరామచంద్రునకు హారతులీరే
శ్రీరామమనోహరికిని హారతులీరే
మారకోటిసుందరునకు హారతులీరే శృం
గారమూర్తి రామునకు హారతులీరే
భూరికృపామూర్తి హరికి హారతులీరే ఘన
వారాన్నిధిబంధనునకు హారతులీరే
సారసాక్షి సీతమ్మకు హారతులీరే బం
గారు తల్లి సీతమ్మకు హారతులీరే
వారిజాక్షు నంగనకు హారతులీరే గుణ
వారాన్నిధి సీతమ్మకు హారతులీరే
వీరిద్దరి కిపుడు సతులు హారతులీరే తని
వారా తలిదండ్రులకు హారతు లీరే
మీరందరు వేడుకతో హారతులీరే మన
సారా మన దేవుళ్ళకు హారతులీరే