శ్రీరాము డున్నాడు చిత్తము నిండి
భూరికృపాళువై పొలిచెడు వాడు
తపసి భార్గవుపైన కృపజూపిన వాడు
అపకారి కాకాసురు కృపనేలిన వాడు
అపరాథి రావణుపై కృపజూపిన వాడు
కపట మెఱుగని బుధ్ధి గలిగిన వాడు
అవలీలగా చెడుగు నణచెడు వాడు
భువనత్రయము నేలు పోడిమి వాడు
పవమానసుతసేవ్య పాదముల వాడు
భవబంధముల నెల్ల వదిలించు వాడు