12, మార్చి 2024, మంగళవారం

అనుమానము మనకెందుకు

అనుమానము మనకెందుకు మనపై కృపగలిగి

వనజాక్షుడు మనరాముడు మననేలును నిజము


వినతాసుతఘనవాహను డని రాముని మునులు

వనజాసనుడును నింద్రుడు ననవిల్తు విరోధి

యును మిక్కిలి వినుతించగ జనులందర మెఱిగి

వినయంబున మనదేవుం డని గొల్చుచు నుండ


చనవిచ్చుచు మనరాముడు మనకుండగ నింక

మన కన్యుల గొనియాడెడు పనియున్నది లేదు

మనసా హరి శుభనామము మన మందర మెపుడు

తనివార రసన మిక్కలిగను నొవ్వగ పలుక