కొందరు రాముడనే గోవిందుడే
కొందరు కృష్ణుడనే గోవిందుడు
అపుడైన నిపుడైన నవనికి దిగివచ్చి
కృపతోడ నరుడైన హరియే వాడు
అపరాథులైనట్టి యసురుల దునుమాడి
ప్రపన్నులను గాచిన ప్రభువే వాడు
ఆరాముడై గాని యాకృష్ణుడై గాని
క్రూరరాక్షసవధను గోవిందుడు
చేరవచ్చిన రాక్షసిని జంపి మొదలిడెను
కోరి జనహితమునా గోవిందుడు
శ్రీరామయని గాని శ్రీకృష్ణయని గాని
నోరార యెవ్వాడు నుడువును వాడు
చేరు గోవిందుని చేర డింక ధరణి
కోరి కొలవండయ్య గోవిందుని