కడు నిన్ను దూరనోప కానీవయ్యా కడమలన్నియు బాసెఁ గానీవయ్యా |
|
నీ కితవైతేఁ జాలు నీ నెలఁత లేమన్న కైకొనేము అందుకేమి కానీవయ్యా ఆకెకు నీవు వలపు ఆకె నీకు వలవనీ కాకు సేయకుంటేఁ జాఁలు కానీవయ్యా |
నీకును |
ఇంటికి వచ్చిన మేలు యేడనుండినా మేలు కంటిమి నీగుణ మెల్లాఁ గానీవయ్యా నంటున నిట్టె నవ్వు నవ్వకుంటే యాకెఁ జూపి కంటకాలాడకు చాలుఁ గానీవయ్యా |
నీకును |
మూఁగినకోపము దీర మాఁటల బుజ్జగించితి కఁగినకాఁకలు జారెఁ గానీవయ్యా పొఁగి నాకు సతమయు పరచిత్తము మానితి కాఁగిన శ్రీవేంకటేశ కానీవయ్యా |
నీకును |
(సౌరాష్ట్రంలో అన్నమాచార్య సంకీర్తనం)