బొమ్మా బొమ్మా ఆడవే ఇమ్మహి నీదే యాడవే సొమ్ముల కొఱకే యాడేవో గుమ్ముగ హరికై యాడేవో |
|
తాపత్రయములు కోపతాపములు చూపుచు కసిగా నాడేవో పాపరహితుడౌ తాపసివిధమున శ్రీపతి మెచ్చగ నాడేవో |
బొమ్మా |
లేని బంధముల లోన చిక్కువడి దీనత చూపుచు నాడేవో జ్ఞానము కలిగిన వాని విధంబున మౌనము గానే యాడేవో |
బొమ్మా |
వచ్చేపోయే వంకర బుధ్ధుల పిచ్చికళలతో నాడేవో ముచ్చటపడి శ్రీరామచంద్రుడే మెచ్చువిధంబుగ నాడేవో |
బొమ్మా |
30, ఆగస్టు 2016, మంగళవారం
బొమ్మా బొమ్మా ఆడవే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)