ఈ రోజున వరూధినిబ్లాగులో క్రొత్తటపా వచ్చింది.
ఫ్లాష్ ! ఫ్లాష్ ! అతి త్వరలో కష్టే ఫలే కబుర్లు ధారావాహిక !
అంటూ.
ఈ ప్రయత్నం పొరపాటు.
అందుకే, దానిపై నావ్యాఖ్యను ఈ ఉదయమే ఇలా వ్రాసాను. (వ్యాఖ్య time stamp Fri, 12 Aug 2016 04:24:19 GMT. అంటే మనసమయంలో ఉ. గం9:59ని)
ఈ ప్రయత్నం సరికాదు.
కష్టేఫలీశర్మగారు కావాలనుకుంటే తమటపాలను బ్లాగులో ఉంచలేరా? వారు ఇకచాలు వద్దు అనుకున్నారు. మధ్యలో జిలేబీగారు దూరి వారి బ్లాగుటపాలను నేను ప్రకటిస్తాను అనటం అక్రమం, అనైతికం. ఇది ఆయన్ను క్షోభపెట్టాలన్న దురుద్దేశం తప్ప మరేమీ కాదు. చాలించండి దుండగాలు. |
ఇది ఇంకా మాలికలో దర్శనం ఇస్తోంది.
వరూధిని బ్లాగువారు నా వ్యాఖ్యను ఎందుకు తొలగించారో మరి.
ఈ విధంగా బ్లాగర్లను వేధించే ప్రయత్నాలను అందరూ త్రిప్పికొట్టాలి.
ఇలాంటి చేష్టలకు తెగబడేవాళ్ళదే పైచేయి అయ్యేపక్షంలో బ్లాగర్లు తమ బ్లాగుల్ని తొలగించటమే ఉత్తమం అనుకొనే పరిస్థితి ఏర్పడుతుంది.