జీవుడు మాయలోన చివురించెనా సం భావింప వీని యందే ప్రభవించెనా మాయ |
||
ఏది సత్యమో గాని యీ మాయ జీవుని బట్టి కామాది రజ్జువుల గట్టుచున్న దయ్య యే మెఱుగని వీని నింతింత యనరాని వ్యామోహముల ద్రిప్పి బడలించుమా రామ |
జీవుడు | |
మాయలోన జీవుడాయె మాయకన్య మెఱుగ డాయె వేయి జన్మ లెత్తె గాని విడువకుండ వెంటనంటి కాయమనే తిత్తినిండ కమ్మియున్న గడుసుమాయ మాయమాయే తీరు దెలిపి మన్నించుమా రామ |
జీవుడు | |
ఆ యద్ద మట్టి ప్రకృతి యందు నీ కనాదిపురుష మాయ ప్రతిబింబోపాధిమాత్ర మని విందుమయ్య నీ యధీనమైన మాయ నెగడించు సృష్టిలోని మాయదారి జీవులకు మంచి చేయుమా రామ |
జీవుడు | |
4, ఏప్రిల్ 2016, సోమవారం
జీవుడు మాయలోన చివురించెనా ?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)