11, జూన్ 2014, బుధవారం

ఇంతకీ చంద్రబాబు ఎప్పుడు పుట్టారో? ఎక్కడ పుట్టారో!

ఇదేం‌ ప్రశ్నా అనకండి.

మొన్న 9వ తారీఖున, సత్యనారాయణశర్మగారి బ్లాగు ఆలోచనాతరంగాలులో చంద్రబాబు ప్రమాణస్వీకార ముహూర్తవిశ్లేషణ - కొత్త ప్రభుత్వం‌ఎదురుగా ఉన్న సవాళ్ళు అనే‌టపా వచ్చింది.  చాలా  విపులంగా విషయం చర్చించారు శర్మగారు.

ఆయన చంద్రబాబు జననతేదీ 20-4-1959 ఉదయం 11.28;79E25;13N39 అంటున్నారు అన్నారు.  అంటే ఈ‌ విషయంలో పూర్తిస్పష్టత లేదన్న అసంతృప్తి అర్థం అవుతున్నది.  వారి ఎరుకలో ఉన్న సమాచారం మేరకు వారు గణింతం‌చేసి ఫలవిశ్లేషణ చేసారు.

నాకుఅసలు చంద్రబాబు జన్మచక్రం అంతర్జాలంలో లభించాలిగా అన్న అనుమానం వచ్చి కొంచెం శోధించాను.
చాలా చిత్రాతి చిత్రమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  అవి మీతో పంచుకుంటే బాగుంటుందని వ్రాస్తున్నాను.  నిజానికి ఈ టపాలో విషయం అంతా మొన్ననే సేకరించినా తగిన విధంగా కూర్పుచేసి ప్రచురించటానికి బోలెడంత సమయం పట్టింది.  ఉదయమూ సాయంకాలమూ కూడా పవర్ కట్ వస్తే ఆలస్యం ఐపోదా ప్రతి చిన్నవిషయమూ!

అన్నింటికంటే చిత్రమైనది మొదట చూదాం.  ఒక వెబ్ సైట్ My Astrology Horoscope లో చంద్రబాబుగారి జాతక చక్రం ప్రకారం చంద్రబాబు పుట్టింది హైదరాబాదులోనట! ఆయన జనన వివరాలు

Birth Date: April 27,1951
Birth Place: Hyderabad ( Andra Pradesh)India
Birth Time: 06:30:00

అలాగే  AstroSage వారిచ్చిన చంద్రబాబు జాతకం ప్రకారం ఆయన జననం హైదరాబాదులోనే.  వారిచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి.

Date of Birth: Friday, April 27, 1951
Time of Birth: 06:30:00
Place of Birth: Hyderabad
Longitude: 78 E 26
Latitude: 17 N 22

My Astrology Horoscope వారు కూడా ఆయన జననం హైదరాబాదులోనే అన్నారు.

Birth Date: April 27,1951
Birth Place: Hyderabad ( Andra Pradesh)India
Birth Time: 06:30:00
 
మరొక చిత్రం చూదాం.  Indian Astroligy Source అనే సైట్‌లో ఇలా వ్రాసారు. " There is no political future for Chandrababu Naidu.  Jagan Mohan Reddy has good future,"

వారే మరొకముక్క కూడా వ్రాసారు చిత్తగించండి " BJP learns good lessons from the defeat in 2014 and will be wise to wheel to success in next election." 

మొన్న జరిగిన 2014 ఎన్నికల ఫలితాలను గురించి డక్కన్ క్రానికల్‌లో గణేశగారి జోస్యం ఒకటి చూడండి.  వారి అంచనా ప్రకారం‌ చంద్రబాబుకు లోక్‌సభలో ఎక్కువ విజయం చేకూరదు. సరే, వారిచ్చిన చంద్రబాబు జాతకం వివరాలు

Name: Chandrababu Naidu
Date: 20th April 1950
Time: 11:28 AM
Place: Tirupati


మరొక Astrology for u .com అనే సైట్ చంద్రబాబు జాతకం పరిశీలించింది. వారు ఇచ్చిన వివరాలు   

Shri N Chandra Babu Naidu was born on 28th February, 1952 at 11.32am. His was born on Thursday and his Thidi is Suklapaksha Chatrudi with Revati 3rd pada of Meena Raasi. At the birth time the remaining period of Budha is 7years 11months and 21 days.
Shri N Chandra Babu Naidu was born on 28th February, 1952 at 11.32am. His was born on Thursday and his Thidi is Suklapaksha Chatrudi with Revati 3rd pada of Meena Raasi. At the birth time the remaining period of Budha is 7years 11months and 21 days. - See more at: http://www.astrologyforu.com/personalities/cbnaidu.php#sthash.eP6nNLUm.dpuf
Shri N Chandra Babu Naidu was born on 28th February, 1952 at 11.32am. His was born on Thursday and his Thidi is Suklapaksha Chatrudi with Revati 3rd pada of Meena Raasi. At the birth time the remaining period of Budha is 7years 11months and 21 days. - See more at: http://www.astrologyforu.com/personalities/cbnaidu.php#sthash.eP6nNLUm.dpuf

కాని వీరు ఆయన ఇంతకీ ఎక్కడ పుట్టిందీ చెప్పలేదు.  అసమగ్రంగా వివరాలు తెలిపితే ఎలాగు? వీరికి తెలియదా మరి?

మరొక చోట  janmakundali.com  అనే దానిలో Nara Chandrababu Naidu was born on 20th April 1950 at 11:28 AM near Tirupathi అని ఇచ్చారు.

అలాగే  India divine.org వారి పేజీలో I am giving below the birth details of Mr.Naidu for students like me to analyse. 20th April 1950, 11:28:35 am IST, 79 E 25' 00", 13 N 39' 00" అని ఉంది,

Vedic Astrology  బ్లాగులో చంద్రబాబు జాతకచక్రం వేస్తూ  Feb-28-1952; 11-32 Morn; Naravaripalle; Chittor Dt. అని ఇచ్చారు.

en.wikipedia వారు తేదీ‌మాత్రమే ఇచ్చారు. born 20 April 1950 అని.  అది జాతకాల సైట్ కాదు కదా. 
తప్పులేదు.

వెబ్‌లో SignificanceofGulika-SureshChandraMishra.pdf అని ఒక ఫైల్ దొరుకుతోంది. అందులో the horoscope of Mr. Chandra Babu Naidu (Chart 5, born on April 27, 1951; at 6:30 hours IST; at 17oN23', 78oE28') అని ఇచ్చారు.

ఇలా చంద్రబాబుగారి జననవివరాలు అస్తవ్యస్తంగా అంతర్జాలంలో కనిపిస్తున్నాయి.  వీటిలో ఏది నిజమో తెలియదు.  అన్నీ తప్పేనేమో కూడా!
 
చంద్రబాబుగారి ప్రమాణస్వీకారానికి శ్రీనివాసగార్గేయగారు ముహూర్తం‌ పెట్టారని విన్నాను.  వారికే సరిగా తెలియాలి చంద్రబాబు జననవివరాలు.