సమైక్యాంధ్రయె వలయునంచును తెలంగాణము బిల్లు వచ్చిన అసెంబ్లీలో ఓడజేతుమ టంచు పలుకకయా! | ఎందుకొచ్చిన బిల్లు బాబూ ఎవరికోసం వ్యర్థచర్చలు పనికిమాలిన బిల్లు వచ్చిన ఓడిపోవుట తప్పునా | |
బిల్లు వచ్చిన చర్చ సేయుడు! రాదు ఓటింగునకు నదియే! ఆర్టికలు మూడునను నిదియే చెప్పబడెనయ్యా! | ఓడినా పట్టించుకొననిది చర్చచేయుట దండుగే కద పనికిమాలిన చర్చ కోసం మూడునంబరు ముచ్చటా | |
అవిశ్వాసమదేమియైనను పార్లమెంటున తెలంగాణము బిల్లు పెట్టుట తథ్యమయ్యా! కండ్లు తెరువుడయా! | తెలుగుజాతిని పార్లమెంటున తుంచి మీతో లాభ మెంచే వారి స్వార్థములోని కుటిలత తెలిసి కన్నులు తెరువుడీ | |
గౌరవము కాపాడుకొని మీ రిట్టి బిల్లును చర్చ సేయుడు! పెద్దరికమును నిలుపుకొనుడయ! వెలిగిపోవుడయా! | ఇట్టి బిల్లును గూర్చి చర్చలు చేసి మురిసే పెద్దరికమును బుధ్ధిహీనులు తప్ప గోరరు ఛీ కొట్టి నెట్టెదరోయ్ |
( గమనిక: ఇక్కడ ఆకుపచ్చరంగు లోనిది శ్రీగుండువారి ఆశ...దోశ...అప్పడం...వడ... టపాకు నా స్పందన. ఆ టపా శీర్షిక చూస్తే వెక్కిరింత, విషయప్రస్తారం చూస్తే బుజ్జగింపుధోరణిలో బెదిరింపు! )