11, డిసెంబర్ 2013, బుధవారం

ఆశ..దోశ.. అంటే సరా?



సమైక్యాంధ్రయె వలయునంచును
తెలంగాణము బిల్లు వచ్చిన
అసెంబ్లీలో ఓడజేతుమ
టంచు పలుకకయా! 

ఎందుకొచ్చిన బిల్లు బాబూ
ఎవరికోసం వ్యర్థచర్చలు
పనికిమాలిన బిల్లు వచ్చిన
ఓడిపోవుట తప్పునా

 
బిల్లు వచ్చిన చర్చ సేయుడు!
రాదు ఓటింగునకు నదియే!
ఆర్టికలు మూడునను నిదియే
చెప్పబడెనయ్యా!

ఓడినా పట్టించుకొననిది
చర్చచేయుట దండుగే కద
పనికిమాలిన చర్చ కోసం
మూడునంబరు ముచ్చటా

 
అవిశ్వాసమదేమియైనను
పార్లమెంటున తెలంగాణము
బిల్లు పెట్టుట తథ్యమయ్యా!
కండ్లు తెరువుడయా!

 

తెలుగుజాతిని పార్లమెంటున
తుంచి మీతో లాభ మెంచే
వారి స్వార్థములోని కుటిలత

తెలిసి కన్నులు తెరువుడీ
గౌరవము కాపాడుకొని మీ
రిట్టి బిల్లును చర్చ సేయుడు!
పెద్దరికమును నిలుపుకొనుడయ!
వెలిగిపోవుడయా!

 

ఇట్టి బిల్లును గూర్చి చర్చలు
చేసి మురిసే పెద్దరికమును
బుధ్ధిహీనులు తప్ప గోరరు
ఛీ కొట్టి నెట్టెదరోయ్

( గమనిక:  ఇక్కడ ఆకుపచ్చరంగు లోనిది శ్రీగుండువారి   ఆశ...దోశ...అప్పడం...వడ... టపాకు నా స్పందన.  ఆ టపా శీర్షిక చూస్తే వెక్కిరింత,  విషయప్రస్తారం చూస్తే బుజ్జగింపుధోరణిలో బెదిరింపు! )

10 కామెంట్‌లు:

  1. >ఆ టపా శీర్షిక చూస్తే వెక్కిరింత, విషయప్రస్తారం చూస్తే బుజ్జగింపుధోరణిలో బెదిరింపు!
    మిత్రులు శ్రీ తాడిగడపవారికి...ఇందులో రెండు ఆశలున్నాయి! ఒకటి బిల్లు ఓటింగుకొస్తే ఓడిద్దామనే ఆశ. రెండు అవిశ్వాసం. ఈ రెండూ జరగనివే...! అందుకని వెక్కిరింత! ఇది ’బుజ్జగింతతో కూడిన బెదిరింపు’ కాదు. బుద్ధి చెప్పడం. అపహాస్యం పాలుగాకుండా జాగ్రత్తపడమని హెచ్చరిక! అంతే!
    స్పందించి టపా పెట్టినందుకు అభినందనలు!

    రిప్లయితొలగించండి
  2. మిత్రులు గుండువారికి నా టపాను సహృదయతతో అభినందించినందుకు కృతజ్ఞతలు. బిల్లు ఓటింగుకు వస్తుందంటారా? ఓడుతుందన్న అనుమానం ఉంటే అసలు ఓటింగే అవసరం కాదన్న మాట అంటారు కదా. చర్చమాత్రమే, ఓటింగులేదు అన్న మాట వినిపిస్తూనే ఉంది కదా? ఇకపోతే అవిశ్వాసం అన్నది తమ అక్రోశం వినిపించేందుకు ఒక తప్పనిసరి ఐపోయిన సాధనంగానే వారూ చూస్తున్నారు కాని అది గెలవటం ఓడటం అన్నవి ప్రధానం అని అనుకుంటున్నారా? లేదే! మీరు బుధ్దిచెప్పటం అన్నమాట వాడారు. ఐతే ఉభయపక్షాలవారు ఆవలిపక్షమే బుధ్ధితెచ్చుకోవాలని అనుకుంటున్నట్లు కనిపిస్తున్నది కద.

    రిప్లయితొలగించండి
  3. "పనికిమాలిన బిల్లు వచ్చిన
    ఓడిపోవుట తప్పునా"

    బిల్లుపై విధానసభకు అభిప్రాయం చెప్పే హక్కు మాత్రమె ఉంది. బిల్లు గెలిచినా ఓడినా అది పార్లమెంటులోనే జరగాలి. అక్కడ బిల్లు ఓడిపోతుందని కోరుకోవడం ఊహాగానం తప్ప మరోటి కాదు .

    "ఇట్టి బిల్లును గూర్చి చర్చలు
    చేసి మురిసే పెద్దరికమును
    బుధ్ధిహీనులు తప్ప గోరరు"

    చర్చ వద్దంటే అదే మాట చెప్పి వెంటనే వెనక్కు పంపడం ఉత్తమం. తద్వారా కాలాన్ని వృధా చేయడం ఎందుకు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గొట్టిముక్కలవారూ,
      విధానసభలో చర్చ యొక్క పరమార్థం కేవలం ఒక తంతు ముగించటమే ఐతే, దానిప చర్చ దండగ. విధానసభలో వ్యక్తమయ్యే అభిప్రాయాలకు విమర్శలకూ తప్పక విలువ ఉండే పక్షంలో చర్చ అనేది అర్థవంతంగా ఉంటుంది. పార్లమెంటులో బిల్లు నెగ్గుతుందా తగ్గుతుందా అన్నదానిపైన నేను వ్యాఖ్యానించటం లేదు కద!

      అలాగె "ఇట్టి బిల్లును గూర్చి చర్చలు చేసి మురిసే పెద్దరికమును బుధ్ధిహీనులు తప్ప గోరరు" అని చెప్పిన పద్యంలోనే ముక్తాయింపుగా "ఛీ కొట్టి నెట్టెదరోయ్" అని కూడా అన్నాను కదా! ఛీ కొట్టటం అన్నదానిలోనే చర్చ దండగే అన్న సూచనా ఉండి కదా! కాలాన్ని వృధాచేయ నవసరం లేదు నిజమే. సీమాంధ్రగోడును పెడచెవిని పెడుతున్న కేంద్ర ఉరఫ్ కాంగ్రెస్ బిల్లును కేవలం తంతుగా అసెంబ్లీకి పంపటం అసెంబ్లీ కాలాన్ని వృధాచేయటమే. రాజకీయావసరాలకోసం రాష్ట్రాల్ని ముక్కలు చేస్తూ అధికారపక్షమూ, అసలు దేశాన్ని చిన్నచిన్న ముక్కలు చేస్తేనే ప్రగతి అంటీ తింగరప్రతిపక్షపార్టీ ఒకటీ ఈ భారతసంవిధానాన్ని భ్రష్టుపట్టిస్తున్నారు. చూదాం, కాలం గడిచే కొద్దీ ఇంకా ఎన్నెన్ని చూడవలసి ఉందో!

      తొలగించండి
    2. విదానసభలో చర్చ ఎందుకు అనేది సంవిధానంలో స్పష్టంగా చెప్పారు. 1953లొ ఆంద్ర రాష్ట్రం మొదలుకొని నేటి తెలంగాణా వరకూ చట్టం ఒకటే. మనకు (కొందరికి) ఇష్టం లేదు కాబట్టి చట్టం మారదు.

      చర్చ దండుగ అని నిర్ణయించుకున్న వారు ఒకే రోజులో బిల్లు వెనక్కి పంపిస్తే, తెలంగాణా రాష్ట్ర ప్రక్రియ వేగవంతం అవుతుంది. మీకు ఎటు తిరిగీ అవసరం లేదు కాబట్టి ఆ పని చేసి పుణ్యం కట్టుకుంటే బాగుండేది. మొత్తం గడువంతా గొడవలతో వాడేసి, ఇంకా వ్యవధి కావాలని అడిగే వ్యూహంలో ఉన్నట్టు కనిపించే ఆంద్ర విదాయకులు ఈ పని చేసుంటే ఇప్పటికయినా కొద్దోగొప్పో తెలంగాణకు న్యాయం చేసిన వారయ్యేవారు. They chose to prolong the proceedings without any benefit for their own reason.

      కేంద్రం (లేదా రాజ్యం) తమ గోడు వినిపించుకోవడం లేదని మీరు అనడం బానే ఉంది. అయితే మనకున్న సమీప ఉదాహరణ (i.e. తెలంగాణా ఉద్యమం) కాస్త చూడండి.

      ఇన్నేళ్ళుగా ఇంత తీవ్రంగా ఉద్యమం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కాంగ్రెస్, తెదేపా, ప్రరాపా, వైకాపా తదితరులు అప్పుడప్పుడూ (తమతమ స్వార్థం బట్టి) తెలంగాణాను ఇస్తామని (లేదా అడ్డుకోమని) కల్లబొల్లి ఖబుర్లు చెప్పాయి. తీరా సమయం వచ్చినప్పుడు మొండి చేయి చూపించాయి.

      మీడియాతో సహా ఎందరో సైంధవ శల్య ప్రయత్నాలు & ప్రహసనాలు చేసారు. రాజకీయ నాయకులు అడుగడునా వంచన చేస్తూ తెగేదాకా లాగినా, తెలంగాణా ప్రజలు వెనక్కు తగ్గకుండా ఒక్కతాటిపై నిలబడి తమ సత్తా చాటుకున్నారు. గత్యంతరం లేని పరిస్తితులలో రాజ్యం తలదించక తప్పలేదు.

      There is no reason to believe the state will behave any differently with anyone else. Telangana people are winning because they remained steadfast and refused to give up the battle.

      తొలగించండి
    3. గొట్టిముక్కలవారూ, చట్టం అనేది నిజానికి అందరికీ ఒకటే కావాలి. విభజన కన్నా అది జరుగుతున్న తీరుమీదే ప్రస్తుతం ఆక్షేపణ హెచ్చుగా కనిపిస్తోంది. అందరికీ సమానంగా న్యాయం చేయటం అన్న వాదననే ఎద్దేవా చేస్తున్నవారు చట్టం అందరికీ సమానం అని నీతివాక్యాలు చెప్పటాన్ని హర్షించటం ఎట్లా? రాజకీయ నాయకుల దృష్టిలో చర్చ దండుగ ఐనా, వారు ఎందుకు కాలయాపన చేస్తున్నారని అడగటం బాగుంది. రాజకీయుల వ్యూహం ఏమిటో మరి! ఐనా, సీమాంధ్ర ఏ గంగలో మునిగినా మాకేం ఇబ్బంది లేదన్న వారికి ఉపకారమో ప్రత్యేకన్యాయమో చేయాలని వారు తొందరపడకపోవటాన్ని ఆక్షేపించటం ఎలా? మీరన్నట్లు తెలంగాణా ఉద్యమాన్ని కూడా కాంగ్రేసు వారు మురగేసారు. చక్కగా తగినంత రాజకీయలబ్ధి తమకు కనిపించే దాకా మురగేసారు. తెలంగాణాసాధనకు ఒక ఎత్తుగడగా, వారితో విలీనం చేస్తా నా పార్టీని అన్న పెద్దమనిషి కూడా, తీరా సమయం వచ్చినప్పుడు మొండి చేయి చూపించాడు కదా? ఇలాంటి ఎత్తుగడలు ఒకరు వెస్తే ఒప్పూ మరొకరు వేస్తే తప్పూ‌ అనలేం. మీ రన్నట్లు "గత్యంతరం లేని పరిస్థితులలో రాజ్యం తలదించింది" అనుకోవటం‌ అర్థసత్యమే. వారికి లాభసాటిగా కనిపించి ముందుకు దూకారు అంతే. అది పాపం వారు అనుకున్నట్లు పారుతోందా లేదా అన్నది వేరే సంగతి. ఇకపోతే తెలంగాణాప్రజల కృతనిశ్చయాన్ని ప్రస్తావించారు. నాకు తెలిసి ఇది రాజకీయనాయకులు తమతమస్వార్థాలకోసం ప్రజల్లో విబెధాలు సృష్టించి తెస్తున్న బలవంతపు మార్పు. ఐతే, ఈ మాట అవగాహనకు రావటానికి తగిన వాతావరణం ఇప్పట్లో ఏర్పడకపోవచ్చును. ఆ విషయం కాస్తా వీరతెలంగాణావాదులకు అవగాహనకు వచ్చిన నాడు సీమాంధ్రప్రజలు ఉదారంగా స్పందించలేక పోవచ్చును. ఈ‌ మాటలు మీకు రుచించక పోవచ్చును కాని దానికి నేనేమీ చేయలేను.

      తొలగించండి
    4. "బలవంతపు మార్పు": You choose to believe Telangana demand is because the people foolishly followed dubious politicians. The sooner you give up this myopic framework, the better it is for everyone. A state of denial is never conducive to any debate.

      PS: When I say "you" above, it applies to the thinking process, not personal.

      తొలగించండి
    5. Most problems the people of India are facing stem fromthe fact they fall for politicians of dubious nature. You call this myopic view?
      I am certain 'you' cannot stand for some process instead of some people.

      తొలగించండి
    6. Sorry I should have said "you applies to those who follow the above thinking process".

      If most problems stem from dubious politicians being followed blindly by gullible people, we should start reversing all the resultant outcomes. It is far more prudent to proceed taking the demands at face value instead attributing motives.

      తొలగించండి
    7. Every demand should be evaluated with respect to the short term and long term consequences of deciding on either direction. All factors including the motives of the proponents or opposers of a given demand are to be considered as to how they cause or influence the consequences of a stand on either direction. On the other hand, taking demands at their face value could cause some harm if we do not properly evaluate how a decision on either side would be reflecting on the whole.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.