1, మార్చి 2013, శుక్రవారం

నేటికి రావణాసురుని

ఉ. నేటికి రావణాసురుని నీతిపరుండని ప్రస్తుతించ నా
రాటము జూపు వారి గన నాయెను వారల దుష్టవాదనా
పాటవ మెల్ల నా యముని పాశము కంఠము నంటు దాక నా
ర్భాటమె గాక రామునకు రాదు కదా యొక లోప మెన్నడున్ 



(వ్రాసిన తేదీ:  2013-1-18)