30, జూన్ 2023, శుక్రవారం
రావయ్య రావయ్య రఘునాయక
రార శ్రీమన్నారాయణ రార మధుసూదన
28, జూన్ 2023, బుధవారం
రామచంద్రుడుండ రక్షకుడై యుండ
27, జూన్ 2023, మంగళవారం
భ్రాంతి తొలగిన సర్వము రామమయము
రాము డెవడని ప్రశ్నించు రాలుగాయి
26, జూన్ 2023, సోమవారం
లచ్చిమగడ నీకు లక్షదండములు
24, జూన్ 2023, శనివారం
భగవంతుడు రాముడై ప్రభవించెను
21, జూన్ 2023, బుధవారం
రావణుని పొగడెడు రాకాసులు
17, జూన్ 2023, శనివారం
అన్యములెన్ను నెడల
15, జూన్ 2023, గురువారం
కాపాడ గద వయ్య రామ
మూర్ఖజనులు తలపరు శ్రీరామ విభుని
సిరిమగండు దిగెను శ్రీరామచంద్రుడై
సరళ.
హరియె యవతరించె రాము డను పేర
13, జూన్ 2023, మంగళవారం
మధురతర రామనామము
12, జూన్ 2023, సోమవారం
శ్రీరామభక్తులను చేరని జన్మ మేలా
ఈ వసంతతిలకం (త-భ- జ-జ-గగ) వృత్తానికి వాడుకే తక్కువ తెలుగు కవిత్వంలో. దీనికి యతిమైత్రిస్థానంగా తెలుగుకవులు 8వ అక్షరం గ్రహించారు. కాని 9వ అక్షరం యతిమైత్రిస్థానంగా మరింత పసందుగా ఉంటుందని కొందరికి అనిపిస్తుంది .కాని ఎనిమిదవ అక్షరంపైన యతిమైత్రి చేయటమే సబబు. ఎందుకో వివరిస్తాను.
అమితంబు లేల
ఒక మంచిపద్యమే చాలు నీగొప్ప నొప్పార జెప్ప
ఒక మంచిభావమే చాలు మనసు నిన్నూహించి మురియ
అకళంకదివ్యప్రభావ శ్రీరామ యమితంబు లేల
నన్ను రక్షించ వలయును
శ్రీరామ నీనామస్మరణ మానక చేసెద నేను
శ్రీరామ నీన్ను పొగడుట మానక చేసెద నేను
శ్రీరామ నన్ను రక్షించ వలయును ప్రీతితో నీవు
శ్రీరామ శ్రీరామ యనిన
10, జూన్ 2023, శనివారం
దాసులపై నమ్మకమ్ము దాశరథికి
కం. కాసుల కమ్ముడు పోరని
దాసులపై నమ్మకమ్ము దాశరథికి యా
దాసులకు ముక్తి నిడు హరి
మోసము లేదనుచు నమ్ము బుధ్ధియు నెసగున్
దాశరథి యైన రామచంద్రప్రభువుకు తన దాసులు కాసులకు అమ్ముడుపోయే రకం జనులు కారని నమ్మకం.
మరి ఆదాసులకో
మోసం ఏమీలేదు హరి తప్పకుండా మోక్షం ఇస్తాడనే నమ్మకం బ్రహ్మాండంగా ఉంది.
4, జూన్ 2023, ఆదివారం
నీవు మెచ్చిన భవవిమోచనం బగును
మధ్యాక్కఱ.
ఎవరి మెప్పును గోరి యేమి పలుకుదు నీశ్వర నేను
సవినయముగ నీదు మెప్పుగోరుదు సాకేతరామ
భువిని నరులమెప్పు నాకేమి పొసగించు మేలు
భువనపతివి నీవు మెచ్చిన భవవిమోచనం బగును
ఓ రామచంద్రప్రభూ.
ఓ ఈశ్వరా, నోరు ఉందికదా అని నేను ఎవరి మెప్పును కోరి యేమి పలుక నయ్యా? సవినయంగా నేను నీ మెప్పును మాత్రమే కోరే వాడిని కదా. భువిని ఈ నరులు మెచ్చితే నాకు ఏమి మేలు పొసగుతుందని? ఆ పొసగినట్లు కనిపించేదేమన్నా ఉన్నా అది పరానికి పనికి వచ్చేది కాలేదు కదా. భువనపతివి ఐన నీవు మెచ్చావే అనుకో అది నాకు భవబంధవిమోచనం కలిగిస్తుంది. అందుచేత నీవు మెచ్చేపలుకులే పలుకుతాను సుమా.