12, జూన్ 2023, సోమవారం

అమితంబు లేల

మధ్యాక్కఱ.
ఒక మంచికీర్తనే చాలు నీతత్త్వ ముగ్గడించుటకు
ఒక మంచిపద్యమే చాలు నీగొప్ప నొప్పార జెప్ప
ఒక మంచిభావమే చాలు మనసు నిన్నూహించి మురియ
అకళంకదివ్యప్రభావ శ్రీరామ యమితంబు లేల
 
ఓ రామచంద్రప్రభూ.
 
ఒక మంచి కీర్తనే చాలు నీ దివ్యతత్త్వాన్ని ప్రకటించి చెప్పటానికి.
ఒక మంచి పద్యమే చాలు నీ గొప్పదనాన్ని సొంపుగా వివరించటానికి.
అలాగే ఒక మంచి భావమే చాలు కదా మనసుకు నిన్ను ఊహించుకొని మురియటానికి.
 
ఓ మచ్చలేని దివ్యప్రభావం కల స్వామీ ఎక్కువగా కీర్తనలో పద్యాలో భావగుంఫనలో చెప్పవలసిన అవసరం ఏముంది?
 
 

2 కామెంట్‌లు:

  1. ఇది కూడా మంచి భావన.

    "తులసి దళమొండు చాల్ హరిఁ దూచఁగలదు."

    శీర్షికలో యడాగమం సరిచూడగలరు.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.