9, ఏప్రిల్ 2020, గురువారం

జయ హనుమంత


పాకారివైరిపుర బాధక హనుమంత

శోకకారణహరణ శ్రీకర హనుమంత



జ్ఞానసాగరరూప జయ హనుమంత

మానితాఖిలగుణమణి హనుమంత

దానవనికురంబ మర్దన హనుమంత

జానకీ శోకసంక్షయ హనుమంత



పవనాత్మజ రామభక్త హనుమంత

రవిపుత్రముఖ్యసచివ హనుమంత

రవికులేశనుత విక్రమ హనుమంత

స్తవనీయచారిత్ర్య జయ హనుమంత



రామభక్త్యమృతార్ణవ హనుమంత

రామభక్త సుఖకారక హనుమంత

రామేష్ట బ్రహ్మచర్యరత హనుమంత

మామీద దయచూపుమా హనుమంత


7 కామెంట్‌లు:

  1. ఈ గీతం చాలా బాగుంది sir.

    రీతిగౌళ రాగం లోని ఘంటసాల గారు పాడిన శేషశైలవాస శ్రీ వేంకటేశ పాట బాణీలో మీరు వ్రాసిన పాట చక్కగా అమరిపోతున్నది.

    నాకు భలే ఆశ్చర్యం వేస్తున్నది ఈ విషయం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా సంతోషమండీ. నిజమేనండీ మీరన్న బాణీలో నేను కట్టుకొని వ్రాయకపోయనా, దానిలో చక్కగా ఒదుగుతున్నది మీరన్నట్లే!!

      తొలగించండి
  2. గురువు గారూ, థాంక్సండీ.

    మా సన్నిహితులతో తెలుగు చదవడం రాని రామభక్తులు మీ బ్లాగును తమ కుటుంబీకులతో చదివించుకొని స్ఫూర్తి పొందుతారు. నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా నా ద్వారా మీకు చేరవేసిన కోరికకు తక్షణమే చక్కటి జవాబు దొరకడం సంతోషం.

    I have shared with my near & dear Ram/Hanuman devotees who asked me to thank you on their behalf also Sir.

    రిప్లయితొలగించండి
  3. నీహారిక గారు,

    మీరు "రామేష్ట బ్రహ్మచర్యరత హనుమంత" అన్న పాదానికి వివరణ అడిగారు. "రామేష్ట బ్రహ్మచర్యరత హనుమంత. What is the meaning of this line ?" అని.

    తీరిక చిక్కక ఇంతవరకూ సమాధానం చెప్పనందుకు మన్నించాలి.

    హనుమంతులవారికి సంబంధించిన ఒక ప్రముఖ స్తుతిలో ఈ రామేష్టః అన్న నామం చూడవచ్చును.

    హనుమనంజనా సూనుః వాయుపుత్రో మహా బలః
    రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షోమిత విక్రమః

    ఉదధి క్రమణశ్చైవ సీతాశోక వినాశకః
    లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా

    ద్వాదశైతాని నామాని కపింద్రస్య మహాత్మనః
    స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రా కాలే విశేషతః
    తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్

    రామేష్టః అన్నది రామస్య ఇష్టః అని విగ్రహం. అనగా రాముడికి ఇష్టుడైన వాడు అని అర్ధం.

    ఇక బ్రహ్మచర్యరతః అన్న దానికి అర్ధం బ్రహ్మచర్య వ్రతము నందు మిక్కిలి ఇష్టము కలిగి అట్లు ప్రవర్తించువాడు అని అర్ధం. హనుమంతులవారు బ్రహ్మచారి అని జగద్వితితమే కదా!

    రిప్లయితొలగించండి
  4. నేను అందుకే అడిగాను. మా కాలనీలో సువర్చలా సహిత ఆంజనేయస్వామి ఆలయం ఉంది. బ్రహ్మచారి ఎలా అవుతారన్నది నా సందేహం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేరే పనిలో ఉన్నానండీ. కొద్దిగా సమయం ఇవ్వండి; వివరిస్తాను.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.