2, ఏప్రిల్ 2020, గురువారం

అన్నిటికిని నాకు నీవున్నా వను నమ్మకము


అన్నిటికిని నాకు నీవున్నా వను నమ్మకము

నన్ను సదా రక్షించుచున్నా వను నమ్మకము



ఈనాటిది కాదు కదా యేనాడీ భూమికి

నేను నేననుచు దిగినానో ఆనాటిది

నానాటికి బలపడినది నన్నెపుడు వీడనిది

నా నమ్మిక  యిది మంచిది నాకు రూఢియైనది



పదునాలుగు లోకములను పాలించు విభుడవే

యిదిగో యొక ప్రాణి నేలుటెంత మాట

మది నొక్కి ఘడియయేని మరువకుండు నన్నును

వదిలి యుందువా నీవు భక్తరక్షణాచణ



అనవరతము నీసేవ నమరుట నావంతు

నను దయతో నేలుట యనునది నీవంతు

వినుతశీల వంతులిట్లు విశదముగ నుండగ

నినునమ్మి భక్తుడనై నిలువనే నిచ్చలును


3 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. అమ్మా భారతి గారు,
      బహుకాలం తరువాత వచ్చారు. చాలా సంతోషం. మీరన్నది నిజం. ఆయనయే జగద్రక్షకుడు కదా.

      తొలగించండి
  2. తరచుగా మీ కీర్తనలు చూస్తుంటానండి. మీ భక్తిని చెమర్చిన కనులతో చూస్తూ ఆనందంగా రామనామస్మరణ చేసుకుంటూ మౌనానుభూతిని పొందుతుంటాను.

    ప్రేమ ముప్పరగొను వేళ నామం దలచువారు.....��

    మీ రామభక్తికి శిరసా నమామి...

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.