15, నవంబర్ 2019, శుక్రవారం

బోధనామాధ్యమం గురించిన రగడ


బోధనామాధ్యమం అన్న మాట వాడినందుకు విసుక్కునే వాళ్ళూ కోప్పడేవాళ్ళూ కూడా ఉంటారని తెలుసు. అంతే కాదు వీలైనంతగా హేళన చేసి సంతోషించేవాళ్ళు కూడా ఎదురుపడతారనీ తెలుసు. ఐనా ఆమాట తెలిసే వాడాను. వీడెవడో పరమచాందసుడు, వీడి బోడి అభిప్రాయాలు మనకెందుకూ అనుకొనే వారికి ఇక్కడితేటే విరమించే అవకాశం ఎలాగూ ఉండనే ఉంది.

మీరు గూగుల్‍లో language of instruction in israel అని శొధిస్తే నాకు మొట్టమొదటగా కనిపించినది

Search Results

Featured snippet from the web

Image result for language of instruction in israel
Hebrew
Medium of Instruction: Hebrew is the main language of instruction in Israeli institutions of higher education. Arabic is the language of instruction at 3 teacher training colleges and Arab teacher centres. Certain bachelor's degree programmes are taught in English.
అసలు నేను మొదలు పెడుతూనే ఈ ఇజ్రాయెల్‍ గురించి ఎందుకు ప్రస్తావించానో వివరిస్తాను. ఈ ఇజ్రాయెల్‍ గురించి మనవాళ్లకు కొద్దోగొప్పో అవగాహన ఉండవచ్చును. కాని అది సరైన విధంగా ఉండకపోవచ్చును. ఈ ఇజ్రాయెల్ అనే దేశం గురించి వికీపీడియా పేజీలో ఏమని వ్రాసి ఉందో తెలుసునా? ఆ పేజీలో ఈ సైన్సు & టెక్నాలజీ విభాగంలో మొదటి పేరాగ్రాఫ్ ఇలా ఉంది.

Israel's development of cutting-edge technologies in software, communications and the life sciences have evoked comparisons with Silicon Valley.[544][545] Israel ranks 5th in the 2019 Bloomberg Innovation Index,[68] and is 1st in the world in expenditure on research and development as a percentage of GDP.[65] Israel boasts 140 scientists, technicians, and engineers per 10,000 employees, the highest number in the world (in comparison, the same is 85 for the U.S.).[546][547][548] Israel has produced six Nobel Prize-winning scientists since 2004[549] and has been frequently ranked as one of the countries with the highest ratios of scientific papers per capita in the world.[550][551][552] Israel has led the world in stem-cell research papers per capita since 2000.[553] Israeli universities are ranked among the top 50 world universities in computer science (Technion and Tel Aviv University), mathematics (Hebrew University of Jerusalem) and chemistry (Weizmann Institute of Science).[391]

ఇందులోని విషయాలను తీసుకొని మనదేశం ఇజ్రాయెల్‍తో పోలిస్తే ఎక్కడ ఉన్నదో ఒక్కమాటు ఆలోచించండి.

తరువాతి పేరా మొదటి వాక్యం చూడండి.  In 2012, Israel was ranked ninth in the world by the Futron's Space Competitiveness Index.[ అని! అంటే అంతరిక్షపరిశోధనారంగంలో అది ప్రపంచంలోనే తొమ్మిదవ స్థానంలో ఉంది అని. మొదటిపది స్థానాలు ఇలా ఉన్నాయట.

 1.  United States 99.67
 2.  Europe 50.11
 3.  Japan 48.76
 4.  Russia 45.29
 5.  China 41.85
 6.  Canada 39.10
 7.  India 28.64
 8.  South Korea 15.22
 9.  Israel 9.30
 10.  Australia 5.22

అసలు Science and technology in Israel అని ఒక పూర్తి వికీ పేజీయే ఉంది. అక్కడ మరిన్ని వివరాలు దొరుకుతున్నాయి.

ఇజ్రాయెల్‍ చాలా చిన్నదేశం. అక్కడ హిబ్రూలో చదువుకోవటానికి ఎవ్వరూ 'ఇంగ్లీషులో చదువుకోకపోతే బ్రతుకులేదు' వంటి కుంటి సాకులు చెప్పటం లేదు. అక్కడ సైన్సును హిబ్రూ భాషలో బోధించటమే కాదు అక్కడి శాస్త్రజ్ఞ్లులు ఆభాషలో పరిశోధనాపత్రాలూ ప్రకటిస్తున్నారు. ఎవ్వరూ సిగ్గుపడటం లేదు (మనలా!)

ప్రపంచవ్యాప్తంగా రష్యన్, జర్మను, ప్రెంచి, స్పానిష్‍, జపనీస్, చైనీస్ చివరికి బుల్లిదేశం భాష ఇటాలియన్‍లో కూడ పరిశోధనాపత్రాలు వెలువడుతున్నాయి.

మనకు తెలుగులో చదువుకుంటే కొంపమునిగిపోతుందన్న భావన ఉండటమే కాదు దాన్ని ప్రభుత్వాలూ బలమైన రాజకీయపార్టీలూ కూడా ప్రచారం చేస్తున్నాయి.

ఆడలేక మద్దెల ఓటిది అన్నట్లుగా మన తెలుగు భాష స్థాయిని పెంచుకోవటం మనకు చేతకావటం లేదు కాబట్టి అసలు మన వెధవాయలకు అలాంటి సదుద్దేశం ఏకోశానా లేదు కాబట్టి, ఇంగీషు భాష ప్రాణాధారం అన్న వాదన చేస్తున్నాం అన్నమాట.

మరిన్ని వివరాలూ సమర్ధనలతో ఇంకా పెద్దగ్రంథమే వ్రాయవచ్చును కాని ఇది చాలనుకుంటున్నాను.

14 కామెంట్‌లు:

 1. ఇజ్రాయిల్ దేశంలో గొప్పవారికి వేరేగా ప్రయివేటు బళ్ళు లేవు (ఉన్నా చాలా తక్కువ). వ్యాపార & ప్రభుత్వ వ్యవహారాలన్నీ హీబ్రూ భాషలోనే జరుగుతాయి కనుక దేశీయ ఉపాధి కష్టం కాదు. దేశం జీడీపీలో సేవా ఎగుమతి రంగం శాతం చాలా తక్కువ.

  పైన చెప్పిన మూడు అంశాలలో ఒక్కటి కూడా మనకు వర్తించదు.

  పైగా మనకున్నన్ని భాషలు అక్కడ లేవు: వారు చేసినట్టు అల్పసంఖ్యాక భాషలను తొక్కేసి అందరూ హిందీ నేర్చుకోవాలంటే ముందు తమిళ తెలుగు వగైరా భాషాభిమానులే రగడ చేస్తారు. అమీత్ షా గారి ట్వీటుపై స్పందన చూసాము కదా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇజ్రాయెల్ దేశంలో కూడా చాలానే భాషలున్నాయండి. ఐతే హీబ్రూదే అధికశాతం. కానీ వారు తమదేశం ఏర్పరుచుకున్న తరువాతనే మరుగునపడిన తమభాషను స్వయంకృషితో అంతర్జాతీయభాషగా అభివృధ్ధి చేసుకున్నారు.

   అల్పసంఖ్యాక భాషలను తొక్కేసి అందరూ హిందీ నేర్చుకోవాలంటే కుదరదన్నది వాస్తవమే. నిజానికి విస్తారమైన సోకాల్డ్‍ హిందీ బెల్ట్ ప్రాంతంలో ఉన్న బోలెడు భాషలవారికి కూడా హిందీ పెత్తనం నచ్చదని మీకూ తెలిసే ఉంంటుంది. నేను ఒకప్పుడు బీహార్ పనిమీద వెళ్ళినప్పుడు తమది హిందీ కాదు బ్రజ్‍భాష అని అక్కడి వాళ్ళు ఎంతో స్వాభిమానంతో చెప్పారు. హిందీ పెత్తనాన్ని ముంబై వాళ్ళూ సహించరు.

   నిజానికి భారతదేశపు అనుసంధాన భాష సంప్రదాయికంగా సంస్కృతం. అంబేద్కర్ సంస్కృతాన్ని జాతీయ అధికారభాష చేద్ద్దామంటే ఇతర సభ్యుల్లో కొందరు ఒప్పుకోలేదు. అలాచెసి ఉంటే, మనకూ చిత్తశుధ్ధి ఉండి ఉంటే సంస్కృతాన్ని మనం కూడా అంతర్జాతీయభాషను చేసి ఉండేవాళ్ళం. అప్పుడు దేశీయ ఉపాధి కష్టం కాదు అన్నస్థితి మనకూ ఉండేది.

   జపాను వాళ్ళూ చైనావాళ్ళూ ఇజ్రాయేలూ జర్మనీ వగైరా దేశాలవాళ్ళూ అంతర్జాతీయ స్థాయిలో బాగానే వెలుగుతున్నారు. వాళ్ళ దేశీయ భాషల్లో విద్యాభ్యాసం చేసి కూడా.

   మనమే ఇంగ్లీషు తప్ప దిక్కులేదు అని సిగ్గులేకుండా ఊరేగుతున్నాం.

   తమిళనాడు గురించి ఒక ముక్క విన్నాను. ఇంగ్లీషు మీడియంలో కావలిస్తే చదువుకోవచ్చును కానీ తమిళ్ మాధ్యమంలో చదువుకున్నవారికే రాంకులు అని ఇవ్వటం జరుగుతుందట. మదరాసుకు పోతే ఏబస్సు ఎక్కడికిపోతుందో చచ్చినా తెలియదు మీకు తమిళం రాకుంటే. మీకు తారసపడ్ద వ్యక్తి తెలుగువాడైనా మీకు తమిళంలోనే చెబుతాడు కాని మీకు సాయపడడు. ఒకప్పుడు TVS కంపెనీకి వెళ్తే అఫీసుపని నిమిత్తం తమిళంలో సంతకం చేస్తే కాని లోపలికి పంపమని గేటుదగ్గరే అటకాయించారు. హోటలుకు తిరిగి వచ్చి ఫోన చెసి చెప్పాను అక్కడి మేనేజరుకు, సాయంత్రం విమానానికి వెనక్కు పోతున్నాననీ ఫలానా కారణం అనీ. గుండెలు గోక్కుంటూ పరుగెత్తుకొని వచ్చి తోడ్కొని వెళ్ళాడు. మళ్ళా గేటుదగ్గర మీగెష్టుకూడా సంతకం చేయాలీ అదీ తమిళంలో అని అంటే చాలా పెద్ద గొడవైనది. దరిమిలా మేనేజ్‍మెంటు వారు మార్గదర్శకాలు జారీచేసారు ఆ విషయంలో. అది వేరే కథ. వాళ్ళకు ఉన్న స్వభాషాభిమానం అలాంటిది. మనవాళ్ళకు ఉన్న స్వభాషావైముఖ్యం ఇలాంటిది!

   రాజకీయ కారణాలవలన తెలుగు భాషనూ తెలుగు జాతినీ పాతరవేయాలన్న ప్రయత్నాలకు మనదేశవాళీ మేథావులూ రాజకీయులూ ఉబలాటపడుతూ ఉండటం విచారకరం.

   తొలగించండి
  2. సార్, ముందు మీ స్పందనలో దొర్లిన రెండు వాస్తవిక పొరపాట్లు (factual errors):

   1. బ్రజ్ భాష శ్రీకృష్ణుడి కాలం నుండి ఉన్నదే కానీ దాని భౌగోళిక పరిధి మథుర చుట్టుపక్కల ఉన్న ప్రాంతం (approximately bounded by Mathura, Gwalior & Bharatpur). మీరు వెళ్ళింది బీహార్ కనుక (ప్రాంతాన్ని బట్టి) అక్కడ వారన్నది భోజపురి లేదా మైథిలి అయుండొచ్చును, బ్రజ్ కాదు.

   2. రాజ్యాంగ సభలో లింకు లాంగ్వేజీ చర్చలలో హిందీ & హిందూస్తానీ (ఉర్దూ) అనే రెండు ప్రత్యామ్నాయాలపై సుదీర్ఘ వాదప్రతివాదాలు జరిగాయి. మదరాసు ప్రతినిధులు హిందీ వైపు మొగ్గు చూపడంతో పోటీ ఆవిధంగా తేలింది. సంస్కృతం గురించి సీరియస్ చర్చలు జరగలేదు.

   టపా అంశం ప్రభుత్వ రంగ ప్రాధమిక విద్యాలయంలో మాతృభాష బోధనా మాధ్యమం కనుక ఆ పరిధిలోనే ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఎవరిది స్వచ్చమయిన భాషాభిమానం, ఎవరిది దురభిమానం అంటూ వెళ్ళితే చర్చ పక్కతోవ పడుతుంది.

   మీరన్నట్టు హీబ్రూ ఒక్కటే ఇజ్రాయెల్ దేశంలో అందరి మాతృభాష కాదు. యిడ్డిష్ రష్యన్ తదితర భాషల పిల్లలు తమతమ మాతృభాషలో ప్రాధమిక విద్య నేర్చుకునే అవకాశాన్ని ఇజ్రాయెల్ కాలరాచింది. మీరు వ్యాసంలో ఉటంకించిన రీసెర్చ్ హీబ్రూ భాషీయులు & ఇంటిభాష వేరయినా హీబ్రూలో (హీబ్రూ"లో", హీబ్రూ "కూడా" కాదు) చదువుకున్న ఇరుపక్షాలు ఉంటారు.

   తెలంగాణాలో ఉర్దూ, లంబాడీ, గోండీ, కోయ భాషలు మాట్లాడే వారు షుమారు నాలుగో వంతు. ఇవి కాక హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం లాంటి వేరే రాష్ట్రాలలో అధికార హోదా కలిగిన భాషల జనాభా కూడా హెచ్చుగానే ఉంటుంది. తల్లితండ్రులు ఇద్దరి భాష తెలుగే అయిన వారిని మాత్రమే లెక్క కడితే రాష్ట్రంలో తెలుగు perhaps majority but by no means dominant అని తెలుస్తుంది. అక్కడక్కడా (అదీ దామాషా కంటే తక్కువ స్థాయిలో) ఉర్దూ మినహాయిస్తే రాష్ట్రంలో ఎక్కడా ఆయా భాషలు ప్రభుత్వ ప్రాధమిక బడులలో బోధనా మాధ్యమంగా లేవన్నది కళ్ళ ముందున్న వాస్తవం.

   ఇతర రాష్ట్రాల పరిస్థితి కూడా దాదాలు ఇంతే. బెల్జియమ్ స్విట్జర్లాండు లాంటి కొన్నిటిని వదిలేస్తే విదేశాలలోనూ చాలామట్టుకు ఇదే జరుగుతుంది.

   ఇజ్రాయెల్ దేశంలో హీబ్రూ యిడ్డిష్ భాషపై, హర్యానాలో హిందీ పంజాబీపై, తెలంగాణాలో తెలుగు లంబాడీపై పెత్తనం చేసినా ఇజ్రాయెల్ యిడ్డిష్ పౌరులు, హర్యానా పంజాబీ పిల్లలు & మన లంబాడీ సోదరులు ఎదగగలిగారు. పరాయి భాషలో భోధన వారి జీవన క్రమంలో adverse effect చూపలేదు.

   Preliminary findings from above:

   1. ఏ భాష అయినా సరే అవకాశాన్ని బట్టి పెత్తనానికి ఆయుధంగా వాడబడుతుంది
   2. ప్రాధమిక విద్యలో బోధనా మాధ్యమం మాతృభాష కానంతమాత్రాన ఘోరమయిన నష్టం రాదు

   తొలగించండి
  3. // "భోజపురి లేదా మైథిలి అయుండొచ్చును," //

   మగధి భాష అయినా అయ్యుండొచ్చు.

   తొలగించండి

 2. శ్యామలరావు గారు,
  టపా బాగుంది. మనకి ఇజ్రయిల్ కి ఎందులోనూ పోలిక లేదండి. వారి దేశం చిన్నది,జనాభా తక్కువ, వారు ఉపాధికి విదేశాలకి పోనక్కర లేదు.వారిది ఒకటే భాష మనకి ఎన్నో! మనదంతా దానికి వ్యతిరేకం.

  మాతృభాషంటే మక్కువే కాని, ఈ భాషలో చదువుకుంటే ఉపాధి లేదు. ఉపాధికోసం బయటికి పోక తప్పదు. అందుకు ఇంగ్లీష్ నేర్వక తప్పదు. మాతృభాష మీద మక్కువ చంపుకోనక్కర లెదు. దీని మీద నిపుణుల సలహాలు ప్రభుత్వాలు పట్టించుకోవు, స్వతంత్రం వచ్చింది మొదలు ఒకరౌనంటే మరొకరు కాదనడమే జరుగుతోంది.

  విద్య వ్యాపారమై చాలా కాలమైయింది, దానిపై చర్చ వ్యర్ధమని నా తలపు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శర్మగారు, నమస్కారం. మీరన్నది నిజమే. విద్య వ్యాపారవస్తువే కాదు రాజకీయవస్తువు కూడా ఐపోయింది. పైన జైగారికి ఇచ్చిన జవాబును కూడా పరిశీలించ ప్రార్ధన. (వారికి జవాబు వ్రాస్తుండగా మీ వ్యాఖ్యవచ్చింది - నేను గమనించలేదు. క్షంతవ్యుడిని)

   తొలగించండి

 3. శ్యామలీయం వారు,
  నమస్కారం.
  నాది వాదంకాదు, సంవాదం కాదు, ప్రతివాదమూ కాదు. మనసులో మాట చెప్పడమే నా ఉద్దేశం.

  మరొకరెవరో మనల్ని మనభాషని తొక్కేస్తున్నారన్నది ఊహేనని అనిపిస్తుంది, అవగాహనా లోపమనీ అనిపిస్తుంది. అవసరం ఏ భాషనైనా నేర్చుకునేలా చేస్తుంది.

  జర్మనీ దేశానికిప్పుడు సంస్కృత భాషా జ్వరం పట్టుకుంది. వర్సిటీలనుంచి సామాన్యుల దాకా. కారణం రేపటి ప్రపంచ భాష సంస్కృతమని వారు ముందుగా గుర్తించడమే.

  సంస్కృతం వద్దు,ఇంగ్లీషు వద్దు, హిందీ వద్దు, తెనుగు ప్రపంచభాష అవుతుందా! ప్రపంచ భాష కావాలంటే తప్పని అవసరం కావాలి కదా! అది జరుతుందా? అలా ప్రపంచభాషగా అవతరించేదాకా మన ఉపాధి సంగతేంటి?

  చివరగా ఒక మాటతో ముగిస్తాను. మీరు చెప్పిన సంఘటనలో మీ అవసరం వారిది గనక వారి రూల్ మార్చుకుని మిమ్మల్ని లోపలికి రానిచ్చారు. అదే మీ అవసరమైతే లోనికి రానిస్తారా? రానివ్వరు గాక రానివ్వరు. తమ స్వభాషపై మక్కువ తప్పుకాదుగాని మిగతా భాషలు అన్నీ చెత్తవి అన్న దురభిమానం కాదా ఆ సంఘటనలో కనపడినది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శర్మగారు, "రేపటి ప్రపంచ భాష సంస్కృతమని వారు ముందుగా గుర్తించడమే." జర్మనీ దేశానికిప్పుడు సంస్కృత భాషా జ్వరం పట్టుకోవటానికి కారణం అన్నారు. నిజమే కావచ్చును.

   చాలా కాలం క్రిందట ఆకాశవాణి వారు సంస్కృతంలో వార్తలను ప్రసారం చేయటం ప్రారంభించినప్పుడు ఆంధ్రప్రభలో ఒక కార్టూన్ వచ్చింది. "ఛాదస్తం కాక పోతే మృతభాషలో మనకు వార్తలెందుకండీ" అని దానికి కాప్షన్ ఒకటి. అసలు ఆ వాక్యంలో బోలెడన్న సంస్కృతపదాలున్నాయే అదెలా మృతభాష అన్న స్పృహ లేదక్కడ! సంస్కృతాన్ని వెక్కిరించి తరించటం మీదనే దృష్టి. అసలా పత్రిక పేరు ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంద్రజ్యోతి లేదా విశాలాంధ్ర ఏదన్నా పేరు సంస్కృతసమాసమే. అందులోనూ విశాలాంధ్ర ఫక్తు కమ్యూనిష్టు పత్రిక కూడాను. మనవాళ్ళ దోరణులు ఇలా ఉంటాయి.

   ఇంత పెద్ద భారత దేశం ఒక అంతర్దాతీయ భాషను తయారు చేసుకోలేకపోయింది. రాబోయే కాలంలో మీరన్నట్లు సంస్కృతం కాస్తా అంతర్జాతీయ భాష అయ్యిందనుకోండి. మనవాళ్ళు ఎంత గొప్పగా సంబరాలు చేసుకుంటారనీ? "భారతీయభాషకు ప్రపంచపట్టాభిషేకం" వంటి శీర్షికలు పెట్టి మరీ వార్తలు వ్రాసి తరిస్తారు.

   ఈరోజున ఇంగ్లీషు ఒక అవసరం స్థాయికి ఈదేశంలో స్థిరపడిందంటే అందులో నాదృష్టిలో సిగ్గుపడవలసినదే ఎక్కువ. ఈ మాటకు అర్థం నేను ఇంగ్లీషు వ్యతిరేకిని అని కాదు.

   తొలగించండి
 4. Like it or not English / Hindi are the Lingua Franca in India now.

  తెలుగు భాష ఉపయోగం పరిరక్షణ బాధ్యతను పత్రికలు ప్రసార మాధ్యమాలు బాగానే నిర్వర్తిస్తున్నా యి. మీరు తమిళనాడు ఉదాహరణ చూపించారు. ఆ రకమైన దురభిమానం విపరీత ధోరణి వాంఛనీయం కాదు.

  I always feel that language has two roles 1) a tool for communication. 2) cultural, sub regional identity.

  There is a particular beauty in every language. One-upmanship or bellicose ideology can only lead to squabbles among people.

  I feel that all students should learn 1) mother tongue 2) English 3) Hindi 4 Sanskrit.

  not many Government schools are there now. I don't think we have quality teachers in English medium in government schools.

  This issue has multiple angles. I for one endorse 4 language formula.

  రిప్లయితొలగించండి
 5. చాలా కాలం క్రిందట, అంటే దశాబ్దాల క్రింతం నీలం సంజీవరెడ్డి గారు త్రిభాషాసూత్రం గుట్టు విప్పారు. తెలుగు పిల్లలు మాతృభాష అని తెలుగు, జాతీయభాష అని హిందీ, ఐఛ్ఛికంగా ఒక భాష - అంతర్జాతీయ భాషగా ఇంగ్లీషు చదువుకోవాలి. అదే ఒక హిందీ రాష్ట్రంలోని పిల్లలు మాతృభాషగా హిందీ, జాతీయభాషగా హిందీ, ఐఛ్ఛికభాషగా హిందీ అని మొత్తం మీద హిందీ ఒక్కటే చదువుకోవచ్చును. తెలుగుపిల్లలు మూడుభాషలు నేర్చుకోవాలి కాని హిందీ పిల్లలు ఒక్క హిందీ నేర్చుకుంటే చాలు. అలా మనకు మూడు భాషలు నేర్చుకోవలసిన భారమూ వారికి ఒక్క భాష నేర్చుకుంటే సరిపడే సౌలభ్యమూ అన్నది ఈ త్రిభాషాసూత్రం అని చెప్పారాయన.

  ఇప్పుడు మీరు మనవాళ్ళను మరో భాషకూడా నేర్చుకోమంటున్నారు!

  మీరన్న మరొక మాట language is a tool for communication అన్న్దది నాకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అలాగైతే a mother is a tool for raising children అని కూడా అనే వాళ్ళనూ మనం తప్పుబట్ట్లలేము. ఒక tool కన్నా ఎక్కువ కాని భాషకు అంతకన్నా ఎక్కువ విలువను ఇవ్వటం అన్న ఉద్దేశం తప్పుబట్ట రానిదే ఐతే, పెరిగి పెద్దయిన వ్యక్తి దృష్టిలో ఒక Tool వంటిదే ఐన తల్లికీ ఎక్కువ విలువను ఇవ్వవలసిన అవసరం లేదన్న అభిప్రాయాన్నీ గౌరవించవలసి వస్తుంది. అవసరం లేని tool ఏదైనా ప్రక్కన పడేయటంలో తప్పులేదుగా మరి. అందుకని ఆట్టే అవసరం కాని మాతృభాషనైనా మాతృమూర్తినైనా విసర్జించటాన్ని హర్షించవలసిందే అన్నమాట. అంతే నంటారా?

  రిప్లయితొలగించండి
 6. మాతృభాష పదం లోనే మాతా శబ్దం ఉన్నది. జీవితాంతం మాతృ భాష నేనులో భాగమే. కాబట్టి విసర్జించే మాట సరికాదు సార్.
  ఎన్ని భాషలు నేర్చుకుంటే అంతమంచిది అని నా అభిప్రాయం. నేను ఇంటర్ దాకా తెలుగు మాధ్యమం లో చదివాను. డిగ్రీలో ఆంగ్ల మాధ్యమం తీసుకున్నాను. కానీ అధ్యాపకుల ఆంగ్ల పరిజ్ఞానం అంతంత మాత్రమే. కొంత కృషి చేసి ఆంగ్లం ఓ మాదిరిగా నేర్చుకున్నాను. చదువు అయిపోయిన తరువాత సంస్కృతం ఇష్టంగా కొంత నేర్చుకున్నాను. హిందీ కూడా ఉద్యోగ రీత్యా లోక వ్యవహారానికి సరిపోయేటంత నేర్చుకున్నాను.
  చిన్నప్పుడు కన్నడ తమిళ పాటలు ఎక్కువగా వినే వాడిని. కొంత పరిచయం ఉంది.
  మా భాష అతి పురాతన మైనది. తక్కినవ న్నీ దిగదుడుపే.ఈ ధోరణి మంచిది కాదు.
  Not displaying bus routes or display boards in English and only in Tamil Hindi or any local language smacks of parochial mindset and sadism.

  We should embrace all languages with open mindset. తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఇంటర్ వరకు బోధించడం మంచిదే.

  పత్రికలు, సామాజిక, ప్రసార మాధ్యమాలు అంతర్జాలం తెలుగును కాపాడే కొత్త సాధనాలు.

  రిప్లయితొలగించండి
 7. ఏమనుకోకండి గానీ స్వభాషాభిమానం గురించి చెప్పడానికి తమిళులు పెద్ద poor example అని నా అనుభవం. వాళ్ళది మూర్ఖాభిమానం. నేను మద్రాసులో కొంతకాలం పని చేశాను. నేను కొత్తగా వచ్చాను, ఇంకా తమిళం రాదు అని చెబితే, ఓహో అలాగా అని మళ్ళీ తమిళంలోనే మాట్లాడే వ్యక్తులు తగిలారు .... పెద్ద చదువులు చదివినవారు, ఉన్నతోద్యోగాలు చేసినవారు కూడా.

  శ్యామలరావు గారి TVS అనుభవం కూడా తమిళుల మూర్ఖత్వమే. శర్మ గారు కరెక్ట్ గా చెప్పినట్లు మీ రాక వారి అవసరం గనక TVS వారు జోక్యం చేసుకున్నారు.

  బస్సులు మీద బోర్డుల విషయంలో కన్నడిగులు, మరాఠీలు కూడా ఏం తక్కువ తినలేదండి. మరాఠీలయితే ఇంకో అడుగు ముందుకు వెళ్ళి బస్స్టాండులోనూ, రెయిల్వే స్టే‌షన్ లోనూ బోర్డులే కాదు, వాటి మీద వేసే అంకెలు, బస్సు లోపల సీట్ల నెంబర్లను కూడా అరబిక్ న్యూమరల్స్ కాకుండా తమ భాష అంకెల్లో వేస్తారు. టిక్కెట్లు మీద కూడా అంతే. రాష్ట్రేతరులు తమ జుట్టు పీక్కోడమే.

  సరే, అసలు సంగతికొస్తే // "ప్రాధమిక విద్యలో బోధనా మాధ్యమం మాతృభాష కానంతమాత్రాన ఘోరమయిన నష్టం రాదు" // అని పైన జై గొట్టిముక్కల గారి వాదనతో నేనూ ఏకీభవిస్తాను.

  కొన్ని ఇతర దేశాల ఉదాహరణలిస్తున్న వారికి నేను ఆనేదేమిటంటే ... ఆ దేశాలకు మనకున్న 200 సంవత్సరాల అవిరామ పరాయిపాలనా ప్రభావపు legacy లాంటిది లేదు, కాబట్టి మాతృభాషా మాధ్యమం వారికి పెద్ద ఇబ్బందేమీ కాదు ... అని నా అభిప్రాయం.

  రిప్లయితొలగించండి
 8. తెగులదేల యన్న దేశమ్ము తెగులు

  ఏను తెగులు జనకుండ తెగులొ‌, చండ

  ఎల్ల జనులు నరుక, నెరుగవే తూలనాడి

  దేశభాషలందు తెగులు తుస్సు

  రిప్లయితొలగించండి
 9. బాష నుధ్ద రించ ప్రజలెల్ల రున్నారు ,
  జనుల భాష కెందు చావు లేదు ,
  వాగు బుధుల వల్ల బాగేమి ? , పుడమిపై
  తెలుగు యశము సతము తేజరిల్లు .

  తెలుగు మాటలాడి తీరక జరుగదు
  యుగ యుగముల దాక , రగడ గాక
  తెలుగు వోవు ననుచు తిక్క తిక్కగ వాగు
  బుధుల కెన్న డైన బుధ్ధి గలద ?

  రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.