ఔరా సమరం అంటే ఇదా?
ఇంక సమరమే అని నీహారిక గారు బెదిరిస్తే అదేం టబ్బా ఈవిడ యుధ్ధానికి దిగటమేమిటీ ఐనా ఎవరితో అని యుధ్ధం చేస్తారూ? అదైనా ఎలా చేయగలరూ అనుకున్నాం. పోనీ నేనే అలా హాశ్చర్యపోయాను.
[ గమనిక: తిరకాసుంది! నీహారిక అని రెండు బ్లాగరు ప్రొఫైళ్ళు కనిపిస్తున్నాయి!
నీహారిక పేరుతో ఇద్దరున్నారో లేదా ఒకరే రెండు బ్లాగరు ప్రొఫైళ్ళు నడిపిస్తున్నారో అన్న అనుమానం వస్తుంది. ఒక ప్రొఫైల్ నీహారిక మరొక ప్రొఫైల్ నీహారిక ఇద్దరూ ఒకరే అని సులువుగానే తెలుసుకోవచ్చును. ఆవిడ టపా ఒకటి శ్యామలీయం గారికి నీహారిక వ్రాయునది... చూడండి. అందులో ఆమె రెండు ప్రొఫైళ్ళూ వాడారు మరి. ]
చివరికి ఆవిడ చేసిన - అక్షరాలా ఏబ్రాసి - పని ఒక స్పామర్‍గా మారటం.
అన్నిబ్లాగుల్లోనూ తిరుగుతూ అభ్యంతరకరమైన వ్యాఖ్య ఒకటి పంచిపెడుతూ పోవటం.
చెడు మీద మంచి యొక్క విజయమే విజయ దశమి అంతరార్థం.
ఇప్పుడు చెడు కామెంట్ల మీద బ్లాగర్లు అక్షరాలా యుధ్ధప్రాతిపదికన స్పందించి విజయం సాధించవలసిన సమయం వచ్చేసింది.
కోపోద్రేకంతో అసమంజసమైన మానసికస్థితిలో ఉన్నవాళ్ళు ఏదన్నా చేస్తారు మరి.
తన దగ్గరా ఒక కంప్యూటరు ఉంది.
తన ముందూ ఒక కీబోర్డు ఉంది.
తన బుర్రనిండా కోపం కూడా ఉంది.
ఇంకే బ్లాగుప్రపంచం నిండా కశ్మలవ్యాఖ్య వ్యాపిస్తోంది.
తస్మాత్ జాగ్రత.
బ్లాగరు మహాశయులారా!
మీరు ఇలాంటి వ్యాఖ్యలు మీ బ్లాగు పేజీల్లో అచ్చు కాకుండా చూడండి దయచేసి.
ఒకవేళ ఇప్పటికే అచ్చైపోతే అవి తొలగించి నష్టనివారణ చర్యలు తీసుకోండి.
రైతులు పొలాల్ని కాపాడుకుంటూన్నట్లే క్రిమికీటకాల నుండి, మీరు కూడా మీ బ్లాగు పేజీలను దుష్టగ్రహాగ్రహావేశాలనే క్రిమికీటకాలనుండి కాపాడుకోండి.
ఇకపై మీ చిత్తం మా భాగ్యం.
Anti-virus సూచించారన్నమాట, ఎంతైనా I.T. వారు కదా 👌.
రిప్లయితొలగించండిమీకు, మీ కుటుంబానికీ విజయదశమి శుభాకాంక్షలు🌹.
ఈ నీహారిక నా బ్లాగ్లో కూడా బురద జల్లింది. ఎవరా అని వెతుకుతుండగా మీ పోస్ట్ కనపడింది. దసర కి ఇదొక వేషం కాబోలు. మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు శ్యామళీయం గారు!
రిప్లయితొలగించండినీహారిక గారు మా యిరువురి మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల్లో ఒక లేఖను మాత్రం ప్రకటించారు. అదే చాలును లెండి. ఆవిడ ఆలేఖను వెదజల్లటంలో నాదేదో తప్పను బయట పెడుతున్నానని ఆవిడ భావిస్తున్నట్లుంది. మంచిది. చదువరులే నిర్ణయించుకో గలరు తప్పొప్పులు.
రిప్లయితొలగించండి