21, సెప్టెంబర్ 2017, గురువారం

అంత కాని వాడనా యింత మౌనమా                అంత కాని వాడనా
                యింత మౌనమా

                నిను గూర్చి తలచి నా
                మనసు మురియు వేళ
                ననుగూర్చి తలపు నీ
                మనసులోన మెదలునా

                యుగములాయె కాలము
                జగములాయె దూరము
                గగనమాయె దరిసెనము
                వెగటుతోచె జీవనము

                నీవు పంప నిట నుంటి
                నీవు పిలువ నట నుందు
                నా వలన నలుగు టుడిగి
                రావించు కొనరాదొకొ


3 కామెంట్‌లు: 1. మౌనంబదేల రా స్వా
  మీ! నిను విడియుగము లాయె మీలనమేలా !
  కాని మనుజుండ నా యీ
  శా! నీ దయ రాద విభుడ సన్నిధి యెపుడో !

  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,

   ముందుగా మీకీ గీతం నచ్చినందుకు ధన్యవాదాలు.

   ఇక మీ‌ గిద్యం గురించి. మీధోరణి మీదే అన్నట్లుంది. నాకిలాంటి కిట్టింపు వ్యవహారాలు నచ్చవు. ఆ సంగతి బ్లాగులోకానికీ మీకూ బాగానే తెలుసును.

   నేరుగా మిమ్మల్ని ఉద్దేశించే అనేకమార్లు ఇలాంటివి వద్దనీ, ముఖ్యంగా నా బ్లాగులో ఇలాంటి అతుకులబొంతపద్యాలను అనుమతించ లేనని పలుమార్లు చెప్పాను. కాని మీరు వినిపించుకోరు.
   ఇలాంటి గిద్యవిద్యావిన్యాసమూ ఒక హాస్యప్రక్రియయే అని మీ రనుకుంటున్నారు. కాదు. విసిగించి వినోదించాలని మీరనుకోవటం సరికాదు.

   ఇకపోతే బ్లాగులోకంలో అంతగా ఛందస్సులగురించి తెలియని వారూ, పద్యాలపై పెద్దగా అవగాహనలేని వారూ కొందరు మీరేదో గొప్ప కవిత్వం నిర్విరామంగా రాసేస్తున్నారని అనుకుంటున్నారు చూడండి - అదీ అసలు సిసలు వినోదవస్తువు.

   ఇకపై మీరు ఇలంటి గిద్యాలు పంపితే అవి ప్రచురించటం ఖచ్చితంగా కుదరదు. మీరెలాగూ మీ అపురూపగిద్యాక్షరమాలికలను మీ బ్లాగుల్లో మళ్ళా యధావిధిగా వెనువెంబడే‌ ప్రచురించుకొని సంబరపడుతూ ఉంటున్నారు కాబట్టి మీకూ‌ పెద్దగాఇబ్బంది ఉండదనే భావిస్తున్నాను.

   ముఖ్యంగా మీ గిద్యాలను నిషేధించి వీటి బారినుండి కనీసం‌ యీ బ్లాగుపాఠకులకైనా కొంచెం మేలు చేయటం మంచిది అనిపిస్తోంది సుమా.

   తొలగించు

 2. హమ్మయ్య.

  మరో సూక్ష్మం తెలిసే :(


  జిలేబి

  రిప్లయితొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.