22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

జరుగని సంగతులపై చర్చలేలజరుగని సంగతులపై చర్చలేల
జరుగుచున్న దెల్ల నీ సంకల్పమే

నిన్ను మరచి నే నుండుట
నన్ను విడచి నీ వుండుట
మిన్ను మిరిగి మీదపడు గా
కెన్నడైన జరిగేనా

ఆ వంకన నీ వుంటివి
ఈ వంకన నే నుంటిని
చేవమీఱ నీదుదునా
ఈ విషభవజలధిని

నేను నీ వను భేదము
నేను నీవు పాటించము
కాని లోక మిరువురని
తా నెంచుట మానేనా