20, సెప్టెంబర్ 2017, బుధవారం

ఎవరికైన ఎఱుకయ్యేనా        ఎఱుకయ్యేనా  ఏనాడైనా
        ఎఱుకయ్యేనా ఎవ్వరి కైనా

           పవలనక రేయనకుండా
           ఎవరెవరి మనసుల లోన
           ఎవరెవరు నెలకొన్నారో
           ఎవరికైన ఎఱుకయ్యేనా

              ఎవరెవరి ఊహల లోన
              చివురెత్తే ఆశల వెనుక
              ఎవరెవరు కదలాడేరో
              ఎవరికైన ఎఱుకయ్యేనా

                 ఎవరెవరి కలల లోనికి
                 కవగూడి సందడిసేయ
                 ఎవరెవరు వస్తున్నారో
                 ఎవరికైన ఎఱుకయ్యేనా


2 కామెంట్‌లు:

  1. ఎవరెవరి మనసులోకి
    చెలిమి చెలమ లూరించ
    ఎవరెవరు స్నేహం పంచేరో
    ఎవరికైన ఎఱుకయ్యేనా

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.