నినుగూర్చి ననుగూర్చి కనుగొన్న వారెవరు
వెనుక నేనాడైన వేడుకగ నేడైన
తనుమాత్రునిగ నన్ను తలచువారే కాని
కనుగొంటిరా నాదు కలరూపు నొకరు
నినునమ్మి యుందునని ననునమ్మ లేని
మనుజులెన్నడు నన్ను మది నెంచగలరు
అటనున్న దిటనున్న దంతయు నొకటన్న
స్ఫుటమైన సత్యమును జూచు వా రెందరు
కుటిలతర్కములందు కూలబడి నట్టి జను
లటమటముననైన తత్త్వార్థవేత్త లగుదురె
ఏవారలు మనల మెత్తు రేవారలు మెచ్చలే
రీవివరముల చింత లెందుకు మనకు
నీవునాకు నీకునేను కావలసిన దిది రామ
పైవారి తోడ మనకు పంతము లేల
13, ఆగస్టు 2017, ఆదివారం
నినుగూర్చి ననుగూర్చి కనుగొన్న వారెవరు
2 కామెంట్‌లు:
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఎంత మంచి తెలుగండి మీది?! మరిచిపోతున్నాననుకున్న ఎన్నో మాటలు మీ ఈ కవితల్లో మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాను (ఉదాహరణకి : అటమటము)
రిప్లయితొలగించండిధన్యవాదాలు లలితగారూ. నా కవిత్వం మీకు నచ్చుచున్నందు చాలా ధన్యవాదాలు. ఈ నా తెలుగును చూసి దడుచుకొనో చిరాకుపడో చాలామంది ఈ బ్లాగుజోలికి రావటం లేదు మరి. ఇంకాచాలా మంది ఈ అథ్యాత్మికకవిత్వం గోలేమిటీ అని ఇక్కకడకు రానే రారు. ఎవరు చదివినా ఎవరు మానినా చదివే వాడొకడున్నాడు. ఆయన్ను ఇష్టపడే వాళ్ళూ ఆయన గురించి వ్రాసేది చదువుతున్నారు. అది చాలదా. అన్నట్లు ఈ నా కొంచెం తెలుగూ ఆయన భిక్షమే కదా. కొందరు రంధ్రాన్వేషణకోసం చదువుతున్నట్లున్నారు కాని వారితో ఇబ్బంది లేదు.
తొలగించండి