11, ఆగస్టు 2017, శుక్రవారం
నీవే నేనుగ నేనే నీవుగ
నీవే నేనుగ నేనే నీవుగ
భావించిన శుభపక్షంబున నిక
బంధము కలదా బాధలు కలవా
సంధించగ ప్రశ్నావళి కలదా
గ్రంథము కలదా గాథలు కలవా
అంధలోక మే మనునో యననీ
లోకము కలదా శోకము కలదా
చీకటి కలదా వేకువ కలదా
యేకత్వము గా కితరము కలదా
ఈ కాలం బిక లేక పోవు కద
నేనుండెదనా నీవుండెదవా
ఈ నేనును నీ వేమి పదములు
తానై నిండిన తత్త్వం బొకటే
జ్ఞానత్రిపుటియు లేనిదె రామ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బంధము కలదా బాధలు కలవా
రిప్లయితొలగించండిసంధించగ ప్రశ్నావళి కలదా..చక్కని పదాల్లిక
శ్యామలీయం బ్లాగుకు స్వాగతం.
తొలగించండిమీకు నచ్చినందుకు సంతోషం. అది వ్యక్తీకరించినందుకు ధన్యవాదాలు.
మీ ఈ కవిత చదివి నేనూ ప్రయత్నించాను - ఒక చిన్న కవిత :)
రిప్లయితొలగించండినేనే ఇహమని నీవే పరమని
ఎఱుకైనది తలపునిక
నీదే భారమని నాదే వరమని
ఏమందును నా భాగ్యమిక
బాగుంది బాగుంది. [ ఒక చిన్న సవరణ, 'ఎఱుకైనది నా తలపున నిక అనండి' మరికొంచెం తూగుకోసం. ]
తొలగించండి