9, ఆగస్టు 2017, బుధవారం
జగ మిది కలయా ఒక చక్కని నిజమా
జగ మిది కలయా ఒక చక్కని నిజమా
తగు సమాధానము దయచేయ వయ్య
కలయైనచో మరి కనులు తెరచి నేనేడ
కలగానిచో రేపు కనులు మూసి నేనేడ
విలువైన వివరము వినిపించవే
చెలుడా యిది నీవు కాక చెప్పేదెవరయ్యా
కలలలో పలుతావుల పలురూపుల నుందునే
అలలవలె మంచిచెడులు కలిగి మలగుచుండునే
చెలికాడ తెలుపవే యిలపై నాకు
కలుగు జన్మములు పెద్ద కలలోని సంగతులా
కలయందువా ఈ కల నీదో నాదేనో
కలకానిచో నా కలరూపు కథయేదో
చెలికాడ యికనైన దయచూపవే
తెలుపవే కల్లనిజము తీయతీయగ రామ
6 కామెంట్‌లు:
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రిప్లయితొలగించండికలయో నిజమో యనుచు
న్నిలలో తహతహ జిలేబి నీల్గుడదేలా !
వలలో పడినావు గదా
సలసల కాగెడు చమురిక సరి సరి మనకే !
జిలేబి
దయచేసి యిలాంటి అవకతవక పద్యాలను ఇక్కడ వ్యాఖ్యలుగా వ్రాయకండి. ప్రచురించలేను.
తొలగించండికలలు నిజమవ్వడమే మధురం.
రిప్లయితొలగించండిఅవునండి.
తొలగించండికల యిది వరమిది
రిప్లయితొలగించండికల నిజమౌనో కాదో నను కలవరమిది
కలని నిజము చేసి
కలవరము - ప్రభు! బాపవయా
చక్కగా చెప్పారు. ఈ జగత్తు అంతా దేవుని కల అని ఒకరు చమత్కరించారు. మనకు సంబంధించి జగత్తు సత్యం - అలా అనుభూతం అవుతూ ఉంది కాబట్టి. శంకరులైతే విశ్వం దర్పణదృశ్యమాననగరీ తుల్యం అన్నారు. అసలు సంగతేమిటో అయనకే యెఱుక. అందుకే ప్రశ్నవేయటం.
తొలగించండి