దేవుడని వీని నెఱిగితే దివ్వసుఖము
భావింపరో యితని పరమదుఃఖము
వెన్నుని దయచాలను వివేకి యగుటే సుఖము
తిన్నగా నటు గాక యున్న దుఃఖము
ఆన్నిటను శ్రీహరిని యరయ గలుగుటే సుఖము
పన్నుగ నాదృష్టిలేక వచ్చు దుఃఖము
సర్వాత్మనా హరిని శరణు జొచ్చుటే సుఖము
గర్వించి తిరుగుచో కలుగు దుఃఖము
నిర్వాణమును గోరి నిలిచి యుండుటే సుఖము
ఉర్వి నన్యుము లడుగ నొప్పు దుఃఖము
శ్రీరామచంద్రు నొగి సేవించుటయే సుఖము
వారిజాక్షుల వెంటబడిన దుఃఖము
తారకనామమును తరచు పలుకుటే సుఖము
ఊరక వదరుచున్న నుండు దుఃఖము