ప్రియ. నను నీ యశం బును రాఘవా కొని యాడనీ తనివారగన్ |
ప్రియ.
ఈ ప్రియావృత్తం ఒక ఇట్టిపొట్టి వృత్తం. గణవిభజన స-వ. అంటే పాదానికి 5 అక్షరాలే అన్నమాట. అందుచేత యతిగొడవ లేదు. ప్రాసనియమం మాత్రం తప్పదు.
ఈ ప్రియావృత్తంలోని నాలుగు పాదాలనూ కలిపి ఒకే పాదంగా వ్రాస్తే అది గీతిక అనే వృత్తం అవుతుంది. దానికి గణవిభజజన స-జ-జ-భ-ర-స-వ అవుతుంది. గీతిక పాదం నిడివి ఇరవై అక్షరాలు కదా, అందుకని యతినియమం వర్తిస్తుంది 13వ స్థానం వద్ద. ఈ గీతికను అప్పకవి ప్రభాకలిత వృత్తం అన్నాడు.
ఇలా చిట్టి పొట్టి పద్యాలు ముక్తకాలుగా బాగుంటాయి. కావ్య నిర్మితిలో కాదని బహుశః పూర్వకవులు భావించేవారేమో. అందుచేత ఇలాంటివి కావ్యాల్లో అరుదుగా కనిపిస్తాయి.