రామకృపాధార ఒకటి నా మీద కురిసెను ఆ మధుర సుధావృష్టి నా మనసు తడిసెను |
|
అంతులేని ప్రయాణము చింతలతో నరకము ఎంత తిరిగినా తెలియ ద చింత్యమైన గమ్యము సుంత విశ్రాంతి గొనే టంత భాగ్య మెక్కడిది పంతమేల రామ యొ క్కింత సాయపడమంటే | |
ఒక నల్లని మేఘమై ఒక చల్లని గాలియై ఒక హాయగు స్పర్శయై ఒక కమ్మని తావియై ఒక సుమధుర గర్జయై సకలతాప మర్దనియై ఒక లీలను నను ముంచుచు వికసించెను విభుని దయ |
|
ఇది నాకు చాలు గదా ఈ జన్మకు ముదితాత్ముడ నైతి రామభూవరు కృపకు విదితమాయె ఆ మబ్బు వెంబడి పోయి సదయుని గేహమ్ము చేరజాలుదు ననుచు అదిగదిగో కదలు చున్నదా నల్లమబ్బు కదలిపోవు చుంటి రామ కారుణ్యవృష్టి పదే పదే హాసశంపాలతల వెలుగుల నిదే దారిచూపుచుండె నీశ్వరుడు నాకు |
|
17, జులై 2015, శుక్రవారం
రామకృపాధార ఒకటి నా మీద కురిసెను
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)