శివుడు పెట్టకుండ బువ్వ చేతికి రాదు ఆ
భవుడీయక రామమంత్రభాగ్యము లేదు
వివరముగా చెప్పనేల విరించ్యాదులకును గూడ
భవతారకమంత్రమహిమభావ్యము కాకుండును
శివభక్తిపరాయణులకు చిక్కును హరిమంత్రము
శివశివశివ యనకుంటే జీవితము వృథా
శివుని నుండి పార్వతికి చెందినదా మంత్రము
శివుడు హనుమయై యుపాసించిన హరిమంత్రము
శివుడు భిక్షగా నీయక చిక్కదు భవతారకము
శివుని వేడి బడయలేని జీవితము వృథా
శివుడు భోళాశంకరుడు జీవులందరకు హితుడు
శివుని పురము చేరి మీరు శివుని మెప్పించవచ్చు
శివసన్నిథి నున్న చాలు శివుడిచ్చును మంత్రము
శివుని చేరమనే వారి జీవితము వృథా
శివుని వేడి కంటే శివుని ఆజ్ఞ గాని చెంత యని గాని ఉంచవచ్చు నేమో చూడండి
రిప్లయితొలగించండి