శ్రీపతినామస్మరణ చేయువారు ధన్యులు
శ్రీపతికృపామృతసంసిధ్ధిగల భక్తులు
శ్రీపతికృపామృతసంసిధ్ధిగల భక్తులు
శ్రీపతినామస్మరణ పాపములను కరగించును
శ్రీపతినామస్మరణ శాపములను తొలగించును
శ్రీపతినామస్మరణ చింత లన్నిటిని బాపును
శ్రీపతినామస్మరణ శీఘ్రముగా రక్షించును
శ్రీపతినామస్మరణ తాపములను హరియించును
శ్రీపతినామస్మరణ లోపములను సరిదిద్దును
శ్రీపతినామస్మరణ చేసి నరుడు తరియించును
శ్రీపతినామస్మరణ చేయుటయే కర్తవ్యము
శ్రీపతియే రాముడనుచు శ్రీపతియే కృష్ణుడనుచు
శ్రీపతియే భువనములను కాపాడెడు దేవుడనుచు
శ్రీపతియే యోగులెల్ల చింతించెడు బ్రహ్మమనుచు
శ్రీపతినామమును సతము చేయువారు ముక్తులు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.