11, జనవరి 2022, మంగళవారం

నామము చేయుచు నుండగా రాముని దయ రాకుండునా

నామము చేయుచు నుండగా రాముని దయ రాకుండునా
రాముని దయ సిధ్ధించగా ఆ మోక్షము రాకుండునా

వైకుంఠాధిప గరుడవాహనా బ్రహ్మాండాధిప రామా యనుచు
పాకశాశన బ్రహ్మాదిసుర ప్రముఖవినుత హరి రామా యనుచు
శ్రీకర శుభకర దశరథనందన సీతారమణా రామా యనుచు
సాకేతాధిప దానవనాశక సంకటమోచన రామా యనుచు

దీనదయాళో దేవదేవ హరి మానవేశ్వర రామా యనుచు
శ్రీనివాస హరి వేంకటనాయక శ్రితజనపోషక రామా యనుచు
ఈనేలను గల యల్పసుఖంబుల నెన్నక శ్రీహరి రామా యనుచు 
మానక భక్తుడు పవలును రేలును మక్కువతోడుత రామా యనుచు

కామితవరదా కరివరదా హరి కరుణాజలధీ రామా యనుచు
కోమలనీలసరోజశ్యామా రామా జగదభిరామా యనుచు
శ్రీమన్నారాయణ హరి  త్రిజగత్సేవితచరణా రామా యనుచు
రామా తారకనామా సంగరభీమా సీతారామా యనుచు


1 కామెంట్‌:

  1. రామనామము, రామనామము రమ్యమైనది రామ నామము. నమ్మి చెడినవారు లేరు, నమ్మకపోతే చెడిపొయ్యేరు.

    రిప్లయితొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.