దోసమెంచక చాల దుడుకుతనము చూపి
మోసగించి బంధించి మురియు శరీరమా
ఇలను చూడ వచ్చినే నిచట చిక్కుపడితిని
కలిగిన యీ భవము నుండి తొలగ లే నైతిని
పలుచ నైన యీ సుఖానుభవము నా కెందుకు
వలచి యీ ఆత్మ నేల పట్టి బంధించితివి
ఈ నీ కపటేంద్రియంబు లేపాటి రజ్జువులు
పోనీ నీ మమతల వల పొంక మేపాటిది
నే నా శాశ్వతుడను నీవు మట్టి బొమ్మవు
నా నిజతత్వమును తెలియ నట్టి యజ్ఞానివి
నీకు నాకు లడాయి నీ వలననె మొదలాయె
నాకు నీ బడాయి నాటి నుండి యెఱుకాయె
నీ కట్టడి చెల్లదని నీ వెఱుగుట మంచిది
నాకు నా రామునకు నేకత్వము నెఱుగుము
15, సెప్టెంబర్ 2012, శనివారం
దోసమెంచక చాల దుడుకుతనము చూపి
ఏమయ్యా నీ కోసం యెక్కడ వెదికేది
ఏమయ్యా నీ కోసం యెక్కడ వెదికేది
ఏ మూలన దాగావని యెంచి నేను వెదికేది
భూమి మీద నీ యునికిని పొడగాంచ లేనైతిని
సామాన్యుడ నాకాశము జల్లెడ పట్టగ లేను
ఏమో ఆ పాతాళలోక మెంత దిగువ నున్నదో
స్వామీ నా వలన గాదు వచ్చి నిన్ను వెదుకగా
వింటిని బ్రహ్మాండమే పిండాండ మన్న మాటొకటి
వెంటనే నాలోన నిన్ను వెదుక నుత్సహించితిని
తుంటరి దీ ప్రకృతి మార్గము తోచ నీయ కున్నదిరా
కంటంగించుకొని చిక్కులు కలిగించు చున్నదిరా
మన మిర్వుర మొకటని మాట యిచ్చి దాగెదవా
అనుపమ కరుణాలవాల యది నీకు వేడుకైన
మనుజుడ పరిమిత సత్వుడ మన్నించి ఇక నీవే
ఘనమైన స్వస్వరూపజ్ఞాన మీయవే రామ

11, సెప్టెంబర్ 2012, మంగళవారం
దివి వా భువి వా. ......
దివి వా భువి వా మమాస్తు వాసో
నరకే వా నరకాంతక ప్రకామం
అవధీరిత శారదారవిందౌ
చరణౌ తే మరణేపి చింతయామి
భావం:
ఓ ముకుందా!
జన్మ మంటూ యెత్తాను కాబట్టి మరణ మనేది కూడా నిశ్చయంగానే వస్తుంది.
ఆ పిమ్మట నా నివాసం యెక్కడ?
భూమి మీద నయితే కాదు గదా?
ఆ వచ్చేది నరకమో స్వర్గమో చెప్పటం కష్టం.
నరకాన్ని యెవరూ కోరుకోరు సరే.
స్వర్గమే దక్కినా చివరకు మళ్ళా భూలోకానికి రాక తప్పదు గదా?
పురాకృత పుణ్యపాపాలకు అనుగుణంగా భూలోకంలో జన్మం అని చెబుతారు.
అలాగే కన్నుమూసే టప్పుడు ఏది మనస్సులో నిలుస్తుందో దాని కనుగుణంగా తిరిగి మరొక జన్మ వస్తుందని చెబుతారు.
పూర్వం జడభరతుడు లేడిని తలచుకొంటూ మరణించాడు. ఆ మునివర్యుడు, తన అనంతరం పాపం ఆ లేడిపిల్ల గతి యేమి అని దానిగురించే మనస్సులో చింతన చేస్తూ ప్రాణం వదిలాడు. అందుకే లేడిగా జన్మించవలసివచ్చింది!
ప్రాణం వదిలేటప్పుడు నిన్ను చింతిస్తూ వదిలితే పునరావృత్తిరహితమైన మోక్షపదమే లభిస్తుంది. ఇంక జన్మం అనేది లేకపోతే యెంత బాగు.
అయితే అలా ప్రాణప్రయాణసమయంలో నిన్ను ఒక్కసారి స్మరిస్తే చాలులే అనుకుంటే అది జరిగే పని యేనా?
దాని కెంత పెట్టి పుట్టాలి. పరమపాపి అయిన అజామీళుడు యే కారణం చేతనయితే నేమి నీ స్మరణ చేసి తరించాడు.
నేను పాపినో పుణ్యాత్ముడనో నాకేమి యెరుక?
అందుచేత ఓ ముకుందా, నేను యీ శరీరం వదిలే సమయంలో కూడా, నా మనస్సులో నీ చరణారవిందాలే నిలచేటట్లుగా దయచేసి అనుగ్రహించు.
అంతకంటే నాకు వేరే యేమి కావాలి. అది చాలు.
స్వేఛ్ఛానువాదం:
నాకు దివియొండె భువియొండె నరకమొండె
యునికి గానిమ్ము నరకారి యుసురు పోవు
సమయ మందున భవదీయ చరణ పద్మ
యుగళి చింతించు నదృష్ట మున్న చాలు

9, సెప్టెంబర్ 2012, ఆదివారం
నాస్ధా ధర్మే న వసునిచయే ...
నాస్ధా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే
యద్భావ్యం తద్భవతు భగవన్ పూర్వకర్మానురూపం
ఏతత్ ప్రాప్త్యం మమ బహుమతం జన్మజన్మాంతరేపి
త్వత్పాదాంభోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు
భావం:
ఓ ముకుందా ఈ ధర్మమనేది ఉందే అది పరిపరి విధాలుగా దుర్గ్రాహ్యంగా ఉంటుంది. అనేక విధి నిషేధాలతోకూడి అల్పబుధ్ధినైన నాకు చిక్కేది కానే కాదు .అందు చేత దానినిగూర్చిన చింతలు చర్చలపైన నాకు యేమీ ఆసక్తి లేదు.
సరి సరి, యీ ధనమేది ఉందే అది బహు చమత్కారమైనది. అనంత విధాలుగా ఉండి యెంత సంపాదించినా సరే సంపాదించనిదే అధికం అనిపించే యెండమావి. దాని వెనుక పరిగెట్టాలనే కోరిక నా కేమీ బలంగా లేదు.
ఇక పోతే ఈ విషయ సుఖాలంటావా అవి మరీ చిత్రమైనవి. ఆ కోరికలు తీరేవి కానే కావు. యెంత అనుబవించినా తృప్తి అనేది యీ నశ్వరమైన శరీరాలకు కలగనే కలగదు కదా. వాటి మీద నాకేమీ వ్యామోహం లేదయ్యా లేదు.
నేను కావాలనుకున్నా వద్దనుకున్నా విధి అనేది వరసగా శరీరాలను ప్రసాదిస్తూనే ఉంటుంది. ప్రతి జన్మలోనూ యేవేవోధర్మాలకు బధ్ధుడను కాక తప్పటమూ లేదు. ఎంతో కొంత పొట్టకోస ఆర్జించటం కోసం తిర్గటమూ తప్పటం లేదు. ఈ శరీరం యొక్క కోరికలను తీర్చటానికి ప్రయత్నించకా తప్పటం లేదు. చాలా చింతించ వలసిన విషయం. ఈ కర్మల ఫలితంగా నాకు జన్మపరంపర యేర్పడుతోంది. ఈ విషయంలో నేను చేయ గలిగింది యేమీలేదనిపిస్తోంది.
పోనీలే జన్మలు వస్తే రానీ - విచారించను. విచారించి ప్రయోజనం లేదు కదా.
కాని అదృష్టవశాన నాకు నీవు సంస్కారాన్ని ప్రసాదించావు. అందుచేత నేను కృతజ్ఞతాపూర్వకంగా చేతులు జోడించి ప్రార్థించేది ఒక్కటే. జన్మజన్మలోనూ ఆ సంస్కారం అలాగే ఉండనీ. జన్మజన్మలలోనూ నా మనస్సులో నీ పాదపద్మాలపట్ల నా భక్తి పరమ నిశ్చలంగా ఉండనీ ప్రభూ. ఓ ముకుందా అది చాలు నాకు.
స్వేఛ్ఛానువాదం
ఒల్లను ధర్మముల్ ధనము లొల్లను కామసుఖంబు లొల్ల నా
తొల్లిటి చేతలం బొరసి తోసుక వచ్చెడి కర్మఫలంబు లే
నొల్లక యుండినన్ కలుగ నున్నవి కల్గిన గల్గనిమ్ము నా
యుల్లము త్వత్పదాంబురుహయుగ్మము నిశ్చల భక్తి గొల్వనీ

8, సెప్టెంబర్ 2012, శనివారం
తప్పో ఒప్పో చేసితి తనువిచ్చి త్రోసితివి
తప్పో ఒప్పో చేసితి తనువిచ్చి త్రోసితివి
అప్పటికిని నాకెంతో చనువిచ్చి బ్రోచితివి
అందు చేత నా వాడ వని నమ్ముకొంటి నీ
యందు నమ్మకముంచి యవనిపై నుంటి నా
బందుగుల యందు నిన్నె పరమాప్తు డంటి నిం
కెందుకురా అంటిముట్ట కుందువురా యంటి
మింటి మీది చందురుని మించిన చల్లని వాడ
జంట బాసి యుందు విది జంకించును నన్ను
వెంటనే యలుక మాని వెనుకటి తీరుగ నా
కంటి కింపుగ తోచవయ్య కరువు తీర్చవయ్య
హృదయమందు స్థిరవాసము నేర్పరచితి నీకు
సదయ యింకేల జాగు సరగునను దయచేసి
ముదము మీర తొల్లిటి వలె పదిలంబు గాను
వదలక నా చెలిమి నుండ వయ్య నా రాముడా
అప్పటికిని నాకెంతో చనువిచ్చి బ్రోచితివి
అందు చేత నా వాడ వని నమ్ముకొంటి నీ
యందు నమ్మకముంచి యవనిపై నుంటి నా
బందుగుల యందు నిన్నె పరమాప్తు డంటి నిం
కెందుకురా అంటిముట్ట కుందువురా యంటి
మింటి మీది చందురుని మించిన చల్లని వాడ
జంట బాసి యుందు విది జంకించును నన్ను
వెంటనే యలుక మాని వెనుకటి తీరుగ నా
కంటి కింపుగ తోచవయ్య కరువు తీర్చవయ్య
హృదయమందు స్థిరవాసము నేర్పరచితి నీకు
సదయ యింకేల జాగు సరగునను దయచేసి
ముదము మీర తొల్లిటి వలె పదిలంబు గాను
వదలక నా చెలిమి నుండ వయ్య నా రాముడా
తప్పు లున్న వేరు రీతి దండించవయ్యా
తప్పు లున్న వేరు రీతి దండించవయ్యా నన్ను
తప్పించుకు తిరిగే విది దారుణమయ్యా
ఏడేడు లోకాల నీవు దాగ గలవు నే
చూడరా లేను వాటి జాడ లే నెఱుగ
వాడుక తప్పించి దాగ వచ్చునా నీకు
వేడుక మీఱగ నీవే విచ్చేయ వయ్య
నిజమే నా బోటి వారు నీకు కోట్ల మంది
నిజము చెప్పు చుంటి నాకు నీవే సర్వస్వము
ఋజువు లేల నీవు నా హృన్మందిరమున
విజయము చేసితి వింక వేరు మాట కలదె
నీవు నే నొకటి యని భావించ మంటివే
యా విధముగు నెయ్యమునే హాయిగా మరచి
నీ వెటనో దాగియున్న నేనేమి చేయుదును
రావయ్యా నా స్వామీ రామా నా కొఱకు
తప్పించుకు తిరిగే విది దారుణమయ్యా
ఏడేడు లోకాల నీవు దాగ గలవు నే
చూడరా లేను వాటి జాడ లే నెఱుగ
వాడుక తప్పించి దాగ వచ్చునా నీకు
వేడుక మీఱగ నీవే విచ్చేయ వయ్య
నిజమే నా బోటి వారు నీకు కోట్ల మంది
నిజము చెప్పు చుంటి నాకు నీవే సర్వస్వము
ఋజువు లేల నీవు నా హృన్మందిరమున
విజయము చేసితి వింక వేరు మాట కలదె
నీవు నే నొకటి యని భావించ మంటివే
యా విధముగు నెయ్యమునే హాయిగా మరచి
నీ వెటనో దాగియున్న నేనేమి చేయుదును
రావయ్యా నా స్వామీ రామా నా కొఱకు
7, సెప్టెంబర్ 2012, శుక్రవారం
నాహం వందే ...
నాహం వందే తవ చరణయోర్ద్వంద్వమద్వంద్వహేతోః
కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం
రమ్యా రామా మృదుతనులతా నందనే నాపి రంతుం
భావే భావే హృదయభవనే భావయేయం భవంతం
భావం:
ఓ ముకుందా!
నిజమే. నీ చరణారవిందాలకు నేను నమస్కారం చేస్తూనేఉంటాను.
ఏదో యీ మానవజన్మ యెత్తాక నరకం రాక తప్పుతుందా శరీరం వదిలాక? అది తెలుసు. ఆ రాబోయేది యే కుంభీపాక నరకమో యేమో అని భయపడుతున్నానా?
దాని నుండి తప్పిస్తావు కదా దయ చూపించి అని నీ కాళ్ళకు మ్రొక్కుతున్నానా?
లేదు సుమా!
సరేలే, ఎత్తాం నరజన్మ సద్వినినియోగం చేసుకుందాం. శృంగారరసాధినాధుడివి నీ కాళ్ళకు మ్రొక్కితే అందమైన అమ్మాయిల్ని అనుగ్రహిస్తావేమో ననే ఆశతో దణ్ణాలు పెడుతున్నానా?
లేదు సుమా!
తండ్రీ! నీచరణారవిందా లున్నాయే, అవి అద్వంద హేతువులు. వాటిని ఆశ్రయించిన వాడికి సకల ద్వంద్వాలనూ నాశనం చేస్తాయవి. అసలు నీవు-తాను అనే ద్వంద్వం కూడా నాశనం అయిపోతుంది కదా. ఇక అటువంటి భక్తుడికి మిగిలేది కైవల్యమే. తానే నీలో ఐక్యం అయిపోతాడు కదా. అంత గొప్పవి నీపాదాలు. అంత గొప్పది నీపాదసేవన మాహాత్మ్యం.
అయినా నా బోటి వాడికి అంత గొప్ప భక్తీ, ఆ కైవల్యం చటుక్కున వచ్చేనా! యేమో.
కాని, జన్మజన్మలకీ ఆ నీ దివ్యపాదాల యెడ నా హృదయంలో వెలుగులీనుతూ ప్రకాశించనీ. నీ యందు నా భక్తిని అవి శాశ్వతంగా నెలకొనేటట్లు చేయనీ.
అందుకే నేను నీ దివ్యశ్రీ చరణాలను ఆశ్రయించుకున్నాను స్వామీ.
నీ యందు నా భక్తిని అవి పెంపొందింప జేసి నన్ను మోక్షార్హుడిని చేస్తాయి అన్న ఆశ మాత్రమే ప్రభూ.
స్వేఛ్ఛానువాదం:
ఉ.శ్రీపతి నీదు పాదముల సేవన చేసిన నెల్ల ద్వంద్వముల్
రూపరు వానినే గొనుట రోయగ నారక భీతి చేతనో
రూపసు లైన కన్యల మరుల్గొని గోరియొ కాదు యే
లోపము లేని భక్తి యెదలోపల నిండగ జన్మజన్మలన్.
ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే
ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే
భవంతమేకాంతమియంతమర్ధం
అవిస్మృతిస్త్వచ్చరణారవిందే
భవేభవే మేఽస్తు భవత్ప్రసాదాత్
భావం:
ఓ ముకుందా!
శిరస్సు వంచి ప్రణామం చేసి నేను నిన్ను యాచించేది ముఖ్యంగా ఒకటే!
నాకు యిలా జన్మ లెత్తటం యెలాగూ తప్పేలా లేదు. పోనీలే!
రాబోయే ప్రతిజన్మలోనూ కూడా నీ పాదారవిందాలను యెట్టి పరిస్థితుల్లోనూ నేను మరచి పోకుండా ఉంటే అదే నాకు చాలు.
నాకు దయ చేసి అటువంటి చక్కని వరం అనుగ్రహించు.
ఆ వరం చాలు నాకు. ఇంకేమీ అవుసరం లేదు.
స్వేఛ్ఛానువాదం::
తే.గీ. శిరసు వంచి విన్నపమును చేయు చుంటి
జన్మజన్మంబు లందు నీ చరణములను
మరువ కుండగ సేవించు వర మొకండు
కరుణతో నిమ్ము తండ్రి నా కదియె చాలు.
( ఈ పద్యం చివరి పాదంలో అఖండయతి వచ్చింది. లాక్షణికుల్లో అఖండయతి పట్ల భిన్నాభిప్రాయా లున్నాయి. చాలా మంది దీన్ని ఒప్పుకోరు. ఒప్పుకున్న వాళ్ళల్లోనూ ఉద్దండులున్నారు - ఉదాహరణకు ఆంధ్రవాల్మీకి బిరుదాంకితులు శ్రీ వావిలకొలను సుబ్బారావుగారు!. అయితే ఇక్కడ అఖండయతి రావటం కేవలం యాదృఛ్ఛికం.)
5, సెప్టెంబర్ 2012, బుధవారం
ఇట్టి నీ మహిమల నెంచ నెవరి వశము
ఇట్టి నీ మహిమల నెంచ నెవరి వశము నన్ను చే
పట్టి బ్రోచుబుధ్ది నీకు పుట్టె నదియే చాలునులే
చెట్టు మీది పుల్లని కాయను చేయగలవు నీవు తీయగ
ఇట్టె నీవు దొంగను గూడ ఋషిని చేయగలవు హాయిగ
పట్టి సకల భువనములను పొట్టలోన దాచగలవు
ఇట్టె రవిని డాచి చుక్కలు పట్ట పగలే చూపగలవు
జట్టు కట్టి నాతో నీవు చుట్టరికము నెఱుపగలవు
ఇట్టె నన్ను జడుని దయతో పట్టి జ్ఞాన మీయగలవు

లేబుళ్లు:
ఆధ్యాత్మ కవితలు - కీర్తనలు
3, సెప్టెంబర్ 2012, సోమవారం
ఒక క్షణము నేను శాశ్వతుడను
ఒక క్షణము నేను శాశ్వతుడను
మరు క్షణము మృతకల్పుడను
ఒక క్షణము మహానందమయుడ
మరు క్షణము శోకవిహ్వలుడను
ఒక క్షణము సర్వభోగయుతుడ
మరు క్షణము రిక్తహస్తుడను
ఒక క్షణము నేను జ్ఞానధనుడ
మరు క్షణము మోహవశుడను
ఒక క్షణము బుధ్ధిమంతుడను
మరు క్షణము బుధ్ధిహీనుడను
ఒక క్షణము నేను యోగీంద్రుడ
మరు క్షణము ప్రకృతి వశుడను
ఒక క్షణము నేను విశ్వమయుడ
మరు క్షణము ధూళి రేణువును
ఒక క్షణము పరమ శాంతుడను
మరు క్షణము క్షోభ్యచిత్తుడను
ఒక క్షణము స్వస్వరూపయుతుడ
మరు క్షణము పరమ పాపరుడను
ఒక క్షణము నేను నీ భక్తుడ
మరు క్షణము నిన్ను మరతును
ఒక క్షణము నేను నిను చేరుదు
మరు క్షణము వేరు పడుదును
ఒక క్షణము గూడ నిను వీడక
ప్రతిక్షణము గడపు వరమిమ్ము
మరు క్షణము మృతకల్పుడను
ఒక క్షణము మహానందమయుడ
మరు క్షణము శోకవిహ్వలుడను
ఒక క్షణము సర్వభోగయుతుడ
మరు క్షణము రిక్తహస్తుడను
ఒక క్షణము నేను జ్ఞానధనుడ
మరు క్షణము మోహవశుడను
ఒక క్షణము బుధ్ధిమంతుడను
మరు క్షణము బుధ్ధిహీనుడను
ఒక క్షణము నేను యోగీంద్రుడ
మరు క్షణము ప్రకృతి వశుడను
ఒక క్షణము నేను విశ్వమయుడ
మరు క్షణము ధూళి రేణువును
ఒక క్షణము పరమ శాంతుడను
మరు క్షణము క్షోభ్యచిత్తుడను
ఒక క్షణము స్వస్వరూపయుతుడ
మరు క్షణము పరమ పాపరుడను
ఒక క్షణము నేను నీ భక్తుడ
మరు క్షణము నిన్ను మరతును
ఒక క్షణము నేను నిను చేరుదు
మరు క్షణము వేరు పడుదును
ఒక క్షణము గూడ నిను వీడక
ప్రతిక్షణము గడపు వరమిమ్ము
లేబుళ్లు:
ఆధ్యాత్మ కవితలు - కీర్తనలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)