15, సెప్టెంబర్ 2012, శనివారం

ఏమయ్యా నీ కోసం యెక్కడ వెదికేది

ఏమయ్యా నీ కోసం యెక్కడ వెదికేది
ఏ మూలన దాగావని యెంచి నేను వెదికేది

భూమి మీద నీ‌ యునికిని పొడగాంచ లేనైతిని
సామాన్యుడ నాకాశము జల్లెడ పట్టగ లేను
ఏమో ఆ పాతాళలోక మెంత దిగువ నున్నదో
స్వామీ నా వలన గాదు వచ్చి నిన్ను వెదుకగా

వింటిని బ్రహ్మాండమే పిండాండ మన్న మాటొకటి
వెంటనే నాలోన నిన్ను వెదుక నుత్సహించితిని
తుంటరి దీ ప్రకృతి మార్గము తోచ నీయ కున్నదిరా
కంటంగించుకొని చిక్కులు కలిగించు చున్నదిరా

మన మిర్వుర మొకటని మాట యిచ్చి దాగెదవా
అనుపమ కరుణాలవాల యది నీకు వేడుకైన
మనుజుడ పరిమిత సత్వుడ మన్నించి ఇక నీవే
ఘనమైన స్వస్వరూపజ్ఞాన మీయవే రామ

4 కామెంట్‌లు:

  1. వింటిని బ్రహ్మాండమే పిండాండ మన్న మాటొకటి
    వెంటనే నాలోన నిన్ను వెదుక నుత్సహించితిని


    నిజమండి, లోన వెదికితే దొరుకుతాడు.

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగా రాసారండి నిజమే భగవంతుడు తానుగా అనుగ్రహించ దలచుకుంటే పక్కనున్న కూడా గుర్తించలేని అజ్ఞానం మనది

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగుంది శ్యామల రావు గారూ!
    చక్కగా వ్రాసారు...
    @శ్రీ

    రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.