దొంగా నిన్ను నేను తిరిగి పట్టుకున్నాను
విశ్వమెల్ల తిప్పి నా హృదయమందె దాగితివా
దొంగా నిన్ను నేను తిరిగి పట్టుకున్నాను
మబ్బుల్లో కొంత తడవు మసలితివా వాటికి నీ
మెరుపులబ్బె గాని నిన్ను దాచలేక పోయినవా
తారలలో కొంత తడవు దాగితివా వాటికి నీ
తళుకులభ్బె గాని నిన్ను దాచ లేక పోయినవా
నదులలోన కొంత తడవు నక్కితివా వాటికి నీ
నడకలబ్బె గాని నిన్ను దాచలేక పోయినవా
తరువులందు కొంత తడవు దాగితివా వాటికి నీ
ధృడతగల్గె గాని నిన్ను దాచలేక పోయినవా
ఎందుపోయి దాగగలవు నీవే నేనైతి గాన
చిందులింక మాని నా చిత్తమందె చేరకుండ
విశ్వమెల్ల తిప్పి నా హృదయమందె దాగితివా
దొంగా నిన్ను నేను తిరిగి పట్టుకున్నాను
మబ్బుల్లో కొంత తడవు మసలితివా వాటికి నీ
మెరుపులబ్బె గాని నిన్ను దాచలేక పోయినవా
తారలలో కొంత తడవు దాగితివా వాటికి నీ
తళుకులభ్బె గాని నిన్ను దాచ లేక పోయినవా
నదులలోన కొంత తడవు నక్కితివా వాటికి నీ
నడకలబ్బె గాని నిన్ను దాచలేక పోయినవా
తరువులందు కొంత తడవు దాగితివా వాటికి నీ
ధృడతగల్గె గాని నిన్ను దాచలేక పోయినవా
ఎందుపోయి దాగగలవు నీవే నేనైతి గాన
చిందులింక మాని నా చిత్తమందె చేరకుండ
మాటలు రావడం లేదు అంత బాగా రాసారు.
రిప్లయితొలగించండిchala bavundi..examples chala baga reflect aiyyayi poem lo :)
రిప్లయితొలగించండిచాలా బాగుంది పెద్దన్నయ్య..నిజంగా అద్భుతం����
రిప్లయితొలగించండిఅరుణ
బ్లాగులు చూడటం ఎప్పుడు మొదలుపెట్టావూ? సంతోషం.
తొలగించండి